For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అనుష్క సైతం పోలీస్ డ్రస్ లో ...ఏమిటీ వరస పెట్టారంతా?

  By Srikanya
  |

  హైదరాబాద్: ఇంతకు ముందు వరకూ హీరోలు పోలీస్ డ్రస్ లో కనపడి అలరించే సినిమాల సీజన్ నడిచింది. ఇప్పుడు హీరోయిన్స్ పోలీస్ డ్రస్ లో కనపడాలని ముచ్చటపడుతున్నట్లున్నారు. మొన్నీమధ్య సుప్రీమ్ లో రాశిఖన్నా..పోలీస్ డ్రస్ లో కనిపించింది. అలాగే రెండు రోజుల క్రితం రెజీనా తను కృష్ణ వంశీ దర్శకత్వంలో చేస్తున్న నక్షత్రం చిత్రం కోసం పోలీస్ డ్రస్ వేసింది.

  అదే కోవలో ఇప్పుడు అనుష్క సైతం పోలీస్ డ్రస్ వేయనుందనని విశ్వసనీయ వర్గాల సమాచారం. అందుతున్న సమాచారం మేరకు అనుష్క తను తాజాగా కమిటైన భాగమతి చిత్రంలో చేస్తున్న క్యారక్టర్ కోసం పోలీస్ డ్రస్ వేస్తోందని చెప్తున్నారు.

  ఇక అరుంధతి చిత్రంనుంచి హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది అనుష్క. ఇటీవల అమె కీలక పాత్రలో నటించిన చారిత్రక చిత్రం రుద్రమదేవి భారీ విజయాన్ని సొంతంచేసుకోవడంతో ఆమెతో మహిళా ప్రధాన చిత్రాలు తెరకెక్కించడానికి దర్శకనిర్మాతలు మరింత ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా పిల్ల జమీందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భాగమతి చిత్రంలో అనుష్క నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె పాత్ర పోలీస్ అని, అది ఓ థ్రిల్లర్ అని తెలుస్తోంది.

  లావు సమస్యతో అనుష్క, లో మెటబాలిజం ప్లాబ్లం, రాజమౌళి వార్నింగ్?

  'భాగమతి' అనే టైటిల్ చూసి ఇది చారిత్రక చిత్రమనే ఇంతకాలం భావించారు. 17వ శతాబ్దం రాజు కులీ కుతుబ్ షా, ఆయన భార్య భాగమతి స్టోరీ ఆధారంగానే ఈ సినిమా ఉంటుందని ఇంతకాలం ప్రచారం జరిగింది. ఇది హైదరాబాద్ చరిత్రతో ముడిపడి ఉన్న కథగా భావించి చాలా మంది ఈ ప్రాజెక్టుపై ఆసక్తి పెంచుకున్నారు. అయితే 'భాగమతి' చిత్రానికి అంత సీన్ లేదని తేలిపోయింది.

  Anushka will wear Khaki?

  ఇది చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కాదు...మామూలు థ్రిల్లర్ మూవీ. ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోయే డైరెక్టర్ అశోక్(పిల్ల జమిందార్ ఫేం) కావాలనే ఇంతకాలం అసలు విషయం దాచి హైదరాబాద్ చరిత్ర మీద ప్రేక్షకులకున్న వీక్ నెస్ తో ఆడుకున్నాడు, తన ప్రాజెక్టు జనాల్లో బాగా నానాలని, పబ్లిసిటీ రావాలని మాయచేసాడు.

  తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనుష్క 'భాగమతి' ప్రాజెక్టుకు సంబంధించిన అసలు విషయం చెప్పింది. 'నేను చేస్తోంది కేవలం ఒక థ్రిల్లర్ సినిమా. 17వ శతాబ్దానికి చెందిన చరిత్ర అని చాలామంది అనుకుంటున్నారు. కాని ఇక్కడ అనుకున్న కథ వేరు. భాగమతి అనే అమ్మాయి చుట్టూ తిరిగే ఒక థ్రిల్లర్ సినిమా' అని తేల్చి చెప్పింది.

  కొన్ని తెలిసినవి, చాలా తెలియనవి : మన స్టార్ హీరోయిన్స్...పబ్లిక్ అయిన వారి లవ్ ఎఫైర్స్

  థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా అత్యంత భారీ స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్ పతాకంపై వి.వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం అనుష్క రెండున్నర కోట్లు పారితోషికాన్ని తీసుకుంటోందని చిత్ర వర్గాల సమాచారం.

  దక్షిణాదిలో ఈ స్థాయిలో పారితోషికం అందుకుంటున్న తొలి కథానాయిక అనుష్క కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ టబుతో పాటు కీలకమైన అతిథి పాత్రలో ప్రభాస్ నటించనున్నారని, మెయిన్ విలన్ పాత్రలో మలయాళ నటుడు జయరామ్ నటిస్తున్నారని తెలిసింది.

  ప్రస్తుతం బాహుబలి 2 చిత్రీకరణలో అనుష్క పాల్గొంటోంది. ఈ సినిమా పూర్తయిన తరువాతే అనుష్క భాగమతి చిత్రీకరణలో పాల్గొంటుందట. కాగా ఈ చిత్రాన్ని తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ విడుదల చేయాలని చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి

  English summary
  Anushka wearing the police dress now. As per the reports coming up, Anushka will be seen wearing a police dress in upcoming film being produced by UV Creations and directed by Ashok of Pilla Zamindar fame.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X