»   » రామ్ చరణ్ చిత్రానికి ఎ.ఆర్.రహమాన్ సంగీతం

రామ్ చరణ్ చిత్రానికి ఎ.ఆర్.రహమాన్ సంగీతం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ కొత్త చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రహమాన్ సంగీత దర్శకత్వం వహించే అవకాసం ఉందా అంటే ఉందనే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. త్వరలో లగాన్ దర్శకుడుతో రామ్ చరణ్ చేయబోయే బాలీవుడ్ ప్రాజెక్టుకు రహమాన్ ని సంగీతం అందించమని అడిగినట్లు తెలుస్తోంది. రహమాన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్తున్నారు. ఈ విషయమై బాలీవుడ్ మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. ఎవరూ దీన్ని ఖండిచను కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాజెక్టులో రహమాన్ ఉన్నట్లే అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

ఇక రామ్ చరణ్ 'జంజీర్' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే అక్కడ పరాజయం చవి చూసిన సంగతి తెలిసిందే. అపూర్వ లఖియా దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై విడుదలకు ముందు నుంచి భారీ అంచనాలు ఉండటం, ప్రేక్షకులు ఊహించిన విధంగా సినిమా లేక పోవడంతో చరణ్ కెరీర్లో పెద్ద ప్లాపు చిత్రంగా నిలిచి పోయింది. దాంతో ఆచితూచి అడుగులు వేస్తూ రామ్ చరణ్ మరో బాలీవుడ్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. బాలీవుడ్ ఇంతకు ముందు లగాన్, స్వదేశ్ లాంటి భారీ హిట్ చిత్రాలు నిర్మించిన అశుతోష్ గోవర్కర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించబోతున్నాడు.

మగధీర, బాహుబలి తరహాలో పీరియడ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం 2014 అక్టోబర్ లేదా నవంబర్లో మొదలయ్యే అవకాశం ఉందని రామ్ చరణ్ వెల్లడించారు. మరో వైపు ఈచిత్రంపై అప్పుడే రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇందులో రామ్ చరన్ సరసన దీపిక పదుకొనె హీరోయిన్ గా నటిస్తుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ప్రస్తుతం రామ్ చరణ్ కృష్ణ వంశీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం చేస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర ఎన్నారై అని తెలుస్తోంది. యు.ఎస్ నుంచి వచ్చిన ఆధునిక భావాలు ఉన్న కుర్రవాడుగా కనిపించనున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ పోనీ టెయిల్ తో స్లిమ్ లుక్‌లో సరికొత్తగా కనిపించనున్నారు. కృష్ణ వంశీ తనదైన స్టైల్‌లో సినిమాను తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం పొల్చాచిలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రాన్ని నిర్మాత బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బేనర్‌పై నిర్మిస్తున్నారు.

English summary
Ram Charan Teja has bagged a big Bollywood offer. High level technicians were roped for the film and as per sources Oscar winner AR Rahman is finalized to compose music for the crazy project.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu