For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నెగిటివ్ టాక్ రాకుండా చేయటానికే పూరీ జగన్నాధ్?

  By Srikanya
  |

  హైదరాబాద్ : పవన్‌కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'కెమెరామన్ గంగతో రాంబాబు'. ఈ చిత్రం విడుదలకు దగ్గరవుతున్న సమయంలో ఈ చిత్రం రెమ్యునేషన్స్ విషయమై దర్శక,నిర్మాతలు మధ్యన విభేధాలు భగ్గుమన్నాయి. తనకు ఇవ్వాల్సిన రెమ్యునేషన్ ఎగ్గొట్టారని పూరీ జగన్నాధ్..దర్సకలు మండలిలో పిర్యాదు చేసారు. దాన్ని టీవీ మీడియాతో సహా అంతటా విపరీతంగా ప్రాచర్యం అయ్యింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంపై నెగిటివ్ టాక్ వచ్చే అవకాసం ఉందని అంతా అభిప్రాయపడ్డారు.

  నాలుగున్నర కోట్ల రూపాయలు తనకు ఇవ్వలేదని ఆ కంప్లైంట్ లో ఆయన రాసారు. ఈ కంప్లైంట్ ని ఆంధ్రప్రదేశ్ డైరక్టర్ అశోశియేషన్ వారు ఫిల్మ్ పెడరేషన్ ఆఫ్ ఇండియా కి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి ఫార్వడ్ చేసారు. నిర్మాతల మండలిలో ఆయన కంప్లైంట్ చేసారు. ఈ విషయమై ఈ చిత్రం రైట్స్ తీసుకున్న దిల్ రాజు చొరవతో మరికొందరు సినీ పెద్దల సహకారంతో పరిష్కారం దొరికినట్లు సమాచారం. ఇక నెగిటివ్ టాక్ ని అధిగమించటానికే రీసెంట్ గా జరిగిన మీడియా సమావేశంలో దర్శక,నిర్మాతలు ఇద్దరూ స్నేహంగా ఉన్నట్లు కనిపించారు. అంతేగాక నిర్మాత..పూర్తిగా దర్శకుడు పూరీ జగన్నాధ్ ని ప్రశంసల్లో ముంచెత్తారు.

  ఇక మీడియా సమవేశాలనికి ముందే మీడియావారిని..ఈ వివాదాన్ని హైలెట్ చేయవద్దని,దానికి సంభందించిన ప్రశ్నలు అడగవద్దని సూచించటం జరిగిందని తెలిసింది. అత్యధిక ప్రింట్లతో వస్తున్న కెమెరామన్ గంగతో రాంబాబు చిత్రం శరవేగంతో ముస్తాబవుతోంది. రీరికార్డింగ్ పూర్తయిందని, మిగిలిన కార్యక్రమాలు ముగించి, అత్యధిక ప్రింట్లతో ఈ నెల 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని నిర్మాత దానయ్య చెప్పారు.

  'ఈ సినిమా ఆడియో, ట్రైలర్స్ విడుదలయ్యాక అంచనాలు భారీగా పెరిగాయి. వాటికి ఏ మాత్రం తగ్గని రీతిలో సినిమా ఉంటుంది. మా హీరో పవన్‌కళ్యాణ్‌గారు నటించిన 'గబ్బర్‌సింగ్' చిత్రాన్ని మించి ఇది హిట్ అవుతుందని కచ్చితంగా చెప్పగలను. పవర్‌స్టార్ అభిమానులకు ఈ సినిమా నేత్రపర్వంగా ఉంటుంది.అలాగే హీరోయిన్ తమన్నా అభినయం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మా బేనరులో జగన్‌గారు చేస్తున్న నాలుగో సినిమా ఇది. కమర్షియల్ అంశాలతో అందరినీ ఆకట్టుకొనే విధంగా చిత్రాన్ని తీర్చిదిద్దారాయన. మా బేనరులో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అవుతుంది' అని ఆయన తెలిపారు.

  తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో గేబ్రియల్, ప్రకాశ్‌రాజ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మనందం ఇతర ముఖ్యతారాగణం. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి.దానయ్య, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.

  English summary
  Filmmaker Puri Jagannadh and producer Danaya have been battling it out publicly over pending monies for the past few days. At a recent press meet for the film the duo are working on, the PR requested media persons to refrain from asking questions on the issue, lest it made the duo uncomfortable. Despite the cold vibes between the two, the producer took the microphone to praise Puri who only sat through the proceedings with a sullen look on his face
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X