»   »  'కుచేలుడు'లో లక్స్ పాప ఐటమ్ సాంగ్

'కుచేలుడు'లో లక్స్ పాప ఐటమ్ సాంగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Asha Saini
చంద్ర ముఖి అనంతరం రజనీకాంత్ పి.వాసు కాంబినేషన్ లో రెడీ అవుతున్న క్రేజీ చిత్రం 'కుచేలుడు'.అందులో ఆశా షైనీ ఓ ఐటమ్ సాంగ్ చేయనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి.అమెరికా వీసా కోసం నకిలీ డాక్యుమెంట్లు సమర్పించి చెన్నై పోలీసుల చేత అరెస్టుకు గురైన ఆశా షైనీ ప్రస్తుతం చాలా డిప్రెషన్ లో ఉంది. అందులోనూ తాజాగా తమిళ సినీ పరిశ్రమ ఆమెపై నిషేధం విధించడంతో మరింత బెంగగా ఉంది.దాంతో కెరీర్ యేమవుతుందో అర్థం కాని దశలో ఈ ఆఫర్ రావటం ఊరటే అంటున్నారు ఆమె శ్రేయాభిలాషులు. ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన నయనతార నటించనుంది. రజనీకాంత్ బాల్య స్నేహితుడిగా జగపతి బాబు, అతని భార్యగా మమతా మోహన్ దాస్ నటించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్నాయి.తమిళ వెర్షన్‌లో సుజ అనే మరో నటి ఈ ఐటమ్ సాంగ్ లో నర్తించనుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X