Don't Miss!
- Finance
pmay: ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? ఇది మీ కోసమే..
- Sports
INDvsNZ : రెండో టీ20 పిచ్ రిపోర్ట్.. డేంజర్లో టీమిండియా రికార్డు!
- News
మా నాన్న జోలికి వస్తే సహించం - తమ్ముడంటే ప్రాణం: రాం చరణ్ వార్నింగ్..!!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
ఎన్టీఆర్ కు కథ చెప్పిన అట్లీ.. మునుపెన్నడూ లేని జానర్ లో సినిమా?
నందమూరి హీరో ఎన్టీఆర్ చివరిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఇప్పుడు మళ్లీ రాజమౌళి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఆయనకు తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కధ చెప్పినట్టు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే

ఆర్ ఆర్ ఆర్ తో బిజీ
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. కానీ ఆ సినిమా ఇప్పట్లో ఆ రిలీజ్ అయ్యే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. కానీ సినిమాని ప్రకటించినట్టుగానే అక్టోబర్ 13న రిలీజ్ చేయడానికి యూనిట్ రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన కొరటాల శివతో ఒక సినిమా చేయబోతున్నాడు.

కొరటాల కాంబో
ఇక ఆ సినిమాలో భరత్ అనే నేను సినిమాలో హీరోయిన్ గా నటించిన కియారా అద్వానీ నటించనుందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయం మీద ఎన్టీఆర్ పుట్టిన రోజున క్లారిటీ వస్తుందని భావించినా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈ సినిమాని కూడా ప్యాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేసే ఆలోచనలో చేస్తున్నారని మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

ప్యూర్ లవ్ స్టోరీ
ఆ
సంగతులు
ఎలా
ఉన్నా
ఇప్పుడు,
అట్లీ
ఎన్టీఆర్
కు
ఒక
ఆసక్తికర
కథ
నెరేట్
చేసినట్లు
తెలుస్తోంది.
అట్లీ
జూనియర్
ఎన్టీఆర్
తో
సినిమా
చేయబోతున్నాడు
అని
చాలా
రోజుల
నుంచే
ప్రచారం
ఉంది.
అయితే
తాజాగా
అట్లీ
జూనియర్
ఎన్టీఆర్
కు
అదిరిపోయే
ప్రేమ
కథను
నెరేట్
చేశాడట.

మళ్ళీ అలాంటి కధతో
రాజారాణి
సినిమాతో
సూపర్
హితన్డుకున్న
ఈ
దర్శకుడు
ఎన్‌టిఆర్‌కు
వివరించిన
ప్రేమకథ
అచ్చం
రాజారాణి
సినిమాని
పోలి
ఉందని
అంటున్నారు.
అంతే
కాక
ఎన్టీఆర్
ఇమేజ్,
మార్కెట్
ను
దృష్టిలో
ఉంచుకుని,
అవసరమైన
అన్ని
కమర్షియల్
హంగులు
జోడించాడని
అంటున్నారు.

కధకి గ్రీన్ సిగ్నల్
నందమూరి
హీరో
అట్లీ
తయారుచేసిన
కథను
ఇష్టపడడమే
కాక
పూర్తి
స్క్రిప్ట్‌ను
డెవలప్
చేయమని
కూడా
కోరాడని
తెలుస్తోంది.
ఇక
అత్లీ
షారుఖ్
ఖాన్‌తో
కలిసి
తన
తదుపరి
బాలీవుడ్
ప్రాజెక్ట్‌ను
పూర్తి
చేసిన
ఎన్టీఆర్
తో
సినిమా
మొదలు
పెట్టే
అవకాశం
కనిపిస్తోంది.
Recommended Video

ఇప్పట్లో కష్టమే
ఇక కొరటాల శివ మరియు ప్రశాంత్ నీల్ ఇద్దరితో ఎన్టీఆర్ సినిమాలు అనౌన్స్ చేశారు. ఈ రెండు సినిమాలు మొదలు కానే లేదు, కాబట్టి ఎన్‌టిఆర్-అట్లీ ప్రాజెక్ట్ ఇప్పట్లో మొదలు కావడం అనేది కాస్త సందేహమే.