»   » తాతగారి మరో పాటని రీమిక్స్ చేస్తున్న జూ.ఎన్టీఆర్

తాతగారి మరో పాటని రీమిక్స్ చేస్తున్న జూ.ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Atta Madugu Vagulona Song Remix In Jr Ntr Movie
హైదరాబాద్ :పాత సినిమాలో హిట్ పాటను రీమిక్స్ చేసి తమ సినిమాలో వాడుకోవటం,విజయం సాధించటం ఇప్పటి తరం హీరోలు,దర్శకులుకు అలవాటుగా మారింది. ఇప్పుడు జూ.ఎన్టీఆర్ మరోసారి అదే రూటులో ప్రయాణం పెట్టుకున్నాడు. గతంలో ఎన్.టి.రామారావు నటించిన 'వేటగాడు' చిత్రంలోని పాటని 'అల్లరి రాముడు' చిత్రం కోసం, 'యమగోల' చిత్రంలోని పాటని 'యమదొంగ' చిత్రం కోసం రీమిక్స్‌గా వాడుకున్న జూ. ఎన్టీఆర్ తాజాగా మరో పాటను తన తాజా చిత్రం 'రభస' కోసం రీమిక్స్ చేయబోతున్నాడని తెలిసింది.

ఎన్.టి.రామారావు నటించిన 'కొండవీటి సింహం' చిత్రంలోని 'అత్తమడుగు వాగులోనా..' అంటూ సాగే పాట ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఇదే పాటను ఎన్టీఆర్ తను నటిస్తున్న తాజా చిత్రం 'రభస' కోసం రీమిక్స్ చేయబోతున్నాడని చిత్ర వర్గాల సమాచారం. తమన్ సంగీతం అందించబోతున్న ఈ పాటను త్వరలో ఎన్టీఆర్‌తో పాటు 'కందిరిగ' ఫేమ్ అక్షపై చిత్రీకరించడానికి దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాల సమాచారం.


సమంతా, ప్రణీత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మినరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. ప్రసుత్తం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. అలాగే 'రభస ' (వర్కింగ్ టైటిల్) రిలీజ్ డేట్ ఖారారైంది. మార్చి 28న ఈ చిత్రం విడుదల చేయాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అదే రోజున ఎన్టీఆర్ కెరీర్ లో మొదటి పెద్ద హిట్ సినిమాగా నిలిచిన ఆది రిలీజైంది. ఈ విషయాన్ని నిర్మాత బెల్లంకొండ సురేష్ సైతం ఖరారు చేసారు. ఆయన మాట్లాడుతూ... '' 2002 మార్చి 28న 'ఆది' సినిమా విడుదలైంది. మా సంస్థలో మేటి చిత్రంగా మిగిలింది. 2014లో అదే రోజున ఇప్పుడు తీస్తున్న ఎన్టీఆర్‌ సినిమాని విడుదల చేస్తాము''అని నిర్మాత బెల్లంకొండ సురేష్ అన్నారు. ఈ సెంటిమెంట్ తో సినిమా రిలీజ్ ప్లాన్ చేయటం అభిమానులకు ఆనందం కలిగించే విషయం.


దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ... మాస్‌ సినిమాలు చూస్తూ పెరిగినవాణ్ని నేను. నాకు ఎలాంటి చిత్రాలు నచ్చుతాయో అలాంటివే తీస్తాను. ఎన్టీఆర్‌ అనగానే శక్తివంతమైన సంభాషణలే గుర్తుకొస్తాయి. అందుకు ఏ మాత్రం తగ్గకుండా ఇందులో మాటలుంటాయి. ఎన్టీఆర్‌ కథ వినగానే నన్ను ప్రోత్సహించారు. నా తొలి చిత్రంలో హీరో ఎలాంటి బాధ్యత లేకుండా కనిపిస్తారు. కానీ ఇందులో హీరో పాత్రకి ఓ పెద్ద బాధ్యత ఉంటుంది. అది ఏమిటన్నది మాత్రం ఆసక్తికరం. ఇందులో సమంత పాత్ర కూడా కీలకమే'' అని చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : అనూప్ రూబెన్స్, ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

English summary
jr.Ntr is ready to make another hit remix song. He had earlier used his grand father, NTR's songs in his films. Now again he is thinking of adopting another hit number. Senior NTR's Attamadugu Vaagulona (Kondaveeti Simham) has been a super hit song. He is likely to use the song in his fresh film Rabhasa as a remix version.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu