»   »  మంచు మనోజ్ సెట్లో వివాదం, నిర్మాతపై దాడి, అసలు ఏం జరిగింది?

మంచు మనోజ్ సెట్లో వివాదం, నిర్మాతపై దాడి, అసలు ఏం జరిగింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నటుడు మంచు మనోజ్ ఈ రోజు వైజాగ్ లో మీడియాని ప్రెస్ మీట్ కు పిలిచారు. వైజాగ్ జూనియర్ ఆర్టిస్ట్ లకు తమ యూనిట్ కు జరిగిన గొడవపై మనోజ్ వివరణ ఇవ్వటానికే మీడియాని ఆహ్వానించినట్లు సమాచారం. నిర్మాతపై దాడి జరిగిందని, అది జూనియర్ ఆర్టిస్ట్ ల పనే అని, ఏ సంఘటనలు జరిగాయనేది ఈ ప్రెస్ మీట్ లో తెలుస్తాయంటున్నారు.

అందుతున్న సమాచారం ప్రకారం...వివాద విషయంలోకి వెళితే...మంచు మనోజ్..గత పదిహేను రోజులుగా...ప్రస్తుతం వైజాగ్ లో ఇంకా పేరు పెట్టని చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఓ కొత్త దర్శకుడు డైరక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కొత్త నిర్మాతలు అచ్చి బాబు, ఎస్ ఎన్ రెడ్డి నిర్మిస్తున్నారు.

కొంతమంది జూనియర్ ఆర్టిస్ట్ లు ఆరోపణ ఏమిటీ అంటే నిర్మాతలు తమకు పది లక్షల రూపాయలు పెండింగ్ డబ్బు ఇవ్వాల్సి ఉందని, 15 లక్షలుకు ఐదు మాత్రమే ఇచ్చారని చెప్తున్నారు.

అయితే వారంతా సెట్ కు వచ్చి ఆగస్టు 1 న సెట్ పై గొడవ చేసారని, మంచు మనోజ్, నిర్మాతల్లో ఒకరు వారిని కొట్టారని అంటున్నారు. దాంతో నిర్మాతపై కూడా వారు దాడి చేసారని తెలుస్తోంది. ఇరు పక్షాలు వారు ఒకరిపై మరొకరు దాడి చేసారంటూ లోకల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు.

Attack On Manchu Manoj Producer!

అయితే మరో వెర్షన్ కూడా వినపడుతోంది. నిర్మాతలు కేవలం ఫిల్మ్ ఫెడరేషన్ రూల్స్ ప్రకారం..ఆ ఫెడరేషన్ లో నమోదు చేసుకున్న లోకల్ జూనియర్ ఆర్టిస్ట్ లకే పని ఇచ్చారు. అయితే ఇది నచ్చని కొంతమంది గుంపుగా వచ్చి నిర్మాతపై ఎటాక్ చేసారని, ఫెడరేషన్ లో లేని ఆర్టిస్ట్ లకు కూడా అవకాసాలు ఇవ్వాలని డిమాండ్ చేసారు. అయితే దీనికి నిర్మాత, హీరో ఒప్పుకోలేదని, దాంతో దాడి చేసారని అంటున్నారు.

ఈ విషయమై నిజా నిజాలు వివరించటానికి మంచు మనోజ్ ప్రెస్ మీట్ పెడుతున్నట్లు సమాచారం. ఈ ప్రెస్ మీట్ లో ఏం చెప్తారో చూడాల్సి ఉంది. అయితే కేవలం తమవైపు విషయాలే వివరిస్తూ జూనియర్ ఆర్టిస్ట్ లది తప్పుగా చూపెడుతూ ఈ ప్రెస్ మీట్ నడవబోతోందా అని కొందరంటున్నారు. వాస్తవానికి ప్రెస్ మీట్ జరిగి, నిజా నిజాలు తెలిసిన తర్వాత ఎవరైనా ఈ విషయమై కామెంట్ చేస్తే మంచిది కదా.

English summary
Manchu Manoj shall offer clarity over this dispute in a special press meet that is going to start shortly.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu