»   » బాహుబలి-2: ప్రభాస్ ఫ్యాన్స్- మెగా ఫ్యాన్స్ ఘర్షణ, ఉద్రిక్తత!

బాహుబలి-2: ప్రభాస్ ఫ్యాన్స్- మెగా ఫ్యాన్స్ ఘర్షణ, ఉద్రిక్తత!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తూర్పుగోదావరి: 'బాహుబలి-2' మూవీ రిలీజ్ సమయంలో చోటు చేసుకున్న ఓ వివాదం అమలాపురంలో ప్రభాస్ అభిమానులు, మెగా ఫ్యామిలీ అభిమానుల మధ్య ఘర్షణకు దారి తీసింది. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో బాహుబలి-2 సినిమా ప్రదర్శించే థియేటర్ల వద్ద పోలీసులు మోహరించారు.

ఈ వివాదానికి కారణం.... బాహుబలి-2 సినిమాకు సంబంధించి అక్రమంగా అదనపు షోలు ప్రదర్శించడమే అని తెలుస్తోంది. దీన్ని మెగా అభిమానులు అడ్డుకునే ప్రయత్నం చేయడం, దాన్ని ప్రభాస్ అభిమానులు ప్రతిఘటించే ప్రయత్నం చేయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.


అసలు ఏ జరిగింది?

అసలు ఏ జరిగింది?

ఆంధ్రప్రదేశ్ లో బాహుబలి-2 మూవీ రోజూ 6 షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం 7 గంటలకు మొదటి షో మొదలవ్వాల్సి ఉండగా... గురువారం రాత్రే పోలీసుల అనుమతితో అదనంగా షోలు వేసి వాటికి భారీగా టిక్కెట్ డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం.


మెగా అభిమానులు అభ్యంతరం

మెగా అభిమానులు అభ్యంతరం

గురువారం రాత్రే బాహుబలి -2 షోలు వేయడాన్ని మెగా ఫ్యామిలీ అభిమాన సంఘాలు, ఇతర హీరోల అభిమాన సంఘాలు వ్యతిరేకిస్తూ వందలాదిగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని దీనిపై కంప్లైంట్ చేసారు, పోలీసులు ఆ షోలను ఆపకపోతే తామే అడ్డుకుంటామని హెచ్చరించారు.


ఎస్పీ, ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన

ఎస్పీ, ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన

మెగా అభిమానులను పోలీసులు అడ్డుకోవడంతో వారు డీఎస్పీ, ఆర్డీవో కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ గొడవ సంగతి అమలాపురంలో క్షణాల్లో పాకిపోయింది. భారీగా ఆందోళనకారులు అక్కడికి చేరుకోవడం మొదలు పెట్టారు.


రంగంలోకి ప్రభాస్ అభిమానులు

రంగంలోకి ప్రభాస్ అభిమానులు

మెగా అభిమానులు బాహుబలి-2 షోల విషయంలో గొడవ చేస్తున్నరనే విషయం తెలిసిన ప్రభాస్ ఫ్యాన్స్ రంగంలోకి దిగడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎలాంటి గొడవలు జరుగకుండా థియేటర్ల వద్ద పోలీసులు మోహరించారు.English summary
Baahubali-2 Release: Tension in Amalapuram. Baahubali 2: The Conclusion is an Indian epic historical fiction film directed by S. S. Rajamouli. It is the continuation of Baahubali: The Beginning.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu