Bahubali 3: బాహుబలి 3పై బిగ్ అప్డేట్.. రాజమౌళి ఫ్లాన్ వేరే లెవెల్‌‌..!

Baahubali 3: తెలుగు సినీ ప్రతిష్ఠను ప్రపంచ వేదికపై నిలబెట్టిన చిత్రం బాహుబ‌లి. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి అత్య‌ద్భుత‌మైన సృష్టి 'బాహుబలి: ది బిగినింగ్', 'బాహుబలి: ది కన్‌క్లూజన్'.ఈ భారీ బ్లాక్ బస్టర్ సినిమాలు భారతీయ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. కలెక్షన్ల పరంగా దేశ వ్యాప్తంగా రికార్డులు బద్దలుకొడుతూ, పాన్ ఇండియా కాన్సెప్ట్‌కి శ్రీకారం చుట్టింది 'బాహుబలి'. ఈ సిరీస్ విజయంతో దక్షిణాది సినిమాలు ఉత్తరాదిపై దండయాత్ర మొదలు పెట్టాయి. ఫలితంగా బాలీవుడ్ ఆధిపత్యం పడిపోయి.. నార్త్ లోనూ సౌత్ సినిమా హావా నడుస్తోంది. రాజమౌళి చూపించిన విజన్ భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మార్చింది. ఇలాంటి "బాహుబలి" సిరీస్ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చేసింది. ఇంతకీ మ్యాటరేంటీ?

భారత సినిమా చరిత్రలో కొత్త అధ్యాయం రాసిన "బాహుబలి" సిరీస్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందట. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి రూపొందించిన ఈ ఎపిక్ రెండు భాగాలు బాహుబలి: ది బిగినింగ్ (2015), బాహుబలి 2: ది కన్‌క్లూజన్ (2017) భారతీయ సినిమాకు గ్లోబల్ రేంజ్ కు తీసుకెళ్లాయి. ఇప్పుడు రాజమౌళి ఈ లెజెండరీ యూనివర్స్‌కి కొత్త రూపాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ఈసారి అది లైవ్ యాక్షన్ కాకుండా, ఆధునిక సాంకేతికతతో కూడిన ఏఐ (AI)ఆధారిత యానిమేషన్ ఫార్మాట్‌లో రూపొందించాలని భావిస్తున్నట్టు సినీ వర్గాల టాక్.

Baahubali 3 SS Rajamouli Plans AI-Based Animated Sequel to Revive the Mahishmati Empire

ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. రాజమౌళి ప్రస్తుతం 'బాహుబలి 3'ని AI, యానిమేషన్ టెక్నాలజీతో రూపొందించే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. దీని ద్వారా మహిష్మతి సామ్రాజ్యం మళ్లీ తెరపైకి వస్తుందట. "యానిమేటెడ్ వెర్షన్ ఆఫ్ బాహుబలి 3 నిజంగానే ప్లాన్‌లో ఉంది. నిర్మాతలు కూడా ఇదే దిశగా ఆలోచిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది" అని తెలుస్తోంది. ప్రస్తుతం లైవ్ యాక్షన్ సీక్వెల్ చేయడం కష్టసాధ్యమని, ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 AD, సలార్ 2 వంటి భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. అనుష్క శెట్టి తన వర్క్ షెడ్యూల్‌ను తగ్గించుకున్నారు. రానా దగ్గుబాటి పాత్ర అయితే బాహుబలి 2 క్లైమాక్స్‌లో ఎండ్ అయ్యింది. కాబట్టి, లైవ్ యాక్షన్ రూపంలో మూడో భాగం తీయడం కాస్టింగ్ పరంగా కష్టంగా మారింది. అందుకే రాజమౌళి టీమ్ ఇప్పుడు యానిమేషన్ ఫార్మాట్ వైపు మొగ్గు చూపుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

రాజమౌళి ఎప్పుడూ టెక్నాలజీని కొత్తగా ఆవిష్కరించడంలో ముందుంటారు. 'మగధీర','ఈగ','బాహుబలి'వంటి చిత్రాల్లో విజువల్ ఎఫెక్ట్స్‌కి కొత్త దారులు తెరిచిన ఆయన, ఇప్పుడు AI ఆధారిత యానిమేషన్ ద్వారా మరోసారి భారతీయ సినిమా స్థాయిని పెంచాలనుకుంటున్నారని సమాచారం. ఈ ప్రాజెక్ట్ సజావుగా సాగితే, సినిమా 2027లో విడుదల కానుంది. ఇక మ్యూజిక్ మాస్ట్రో ఎం.ఎం. కీరవాణి, రచయిత విజయేంద్ర ప్రసాద్ మళ్లీ ఈ ప్రాజెక్ట్‌లో రాజమౌళితో కలిసే అవకాశం ఉంది. "బాహుబలి సినిమా కాదు, అది ఒక భావోద్వేగం. దాన్ని యానిమేషన్ ఫార్మాట్‌లో చూపడం కొత్త ప్రాణం పోసినట్లే"అని మూవీ లవర్స్ భావిస్తున్నారు.

యానిమేట్ లో ఈ మూవీని రూపొందిస్తే.. బడ్జెట్ కూడా సాధ్యమైనంత తక్కువ అవుతుంది. ఉదాహరణకు ఒక సినిమాను రియల్ గా తీస్తే.. దాదాపు రూ. 200 కోట్లు ఖర్చయితే, యానిమేటెడ్ వెర్షన్‌లో కేవలం రూ. 40 నుంచి రూ. 50 కోట్లలో అద్భుతంగా చేయవచ్చు. అది సులభంగా రికవర్ అవుతుంది. అంతేకాకుండా విజువల్స్ మాత్రం ప్రపంచ స్థాయిలో ఈజీగా రీచ్ అవుతుందని భావిస్తున్నారంట. ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. ఈ సినిమా కోసం దాదాపు 100 మంది యానిమేటర్స్ ఈ ప్రాజెక్ట్‌పై పని చేయనున్నారని తెలుస్తోంది. వారు వివిధ యాంగిల్స్‌లో సన్నివేశాలను రూపొందించి, హై లెవల్ విజువల్ ఫీలింగ్ అందించాలనుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో మళ్లీ రాజమౌళి, కీరవాణి, విజయేంద్ర ప్రసాద్ త్రయం కలిసే అవకాశం ఉంది.

'మహావతార్ నరసింహ' వంటి యానిమేటెడ్ చిత్రాల గ్లోబల్ విజయం తర్వాత, టాలీవుడ్ కూడా ఇప్పుడు ఈ కొత్త దారిని అన్వేషిస్తోంది. రాజమౌళి తీసుకునే ఈ నిర్ణయం టాలీవుడ్‌కి ప్రేరణ. ఇకపై మనం కూడా హాలీవుడ్ స్థాయి యానిమేషన్ చిత్రాలను సృష్టించగలమనే నమ్మకం పెరుగుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. రాజమౌళి ఎప్పుడూ ఊహించని దారులు ఎంచుకునే దర్శకుడు. ఇప్పుడు ఆయన తీసుకున్న ఈ ఐఏ యానిమేషన్ ప్రయోగం భారతీయ సినిమా చరిత్రలో మరో మలుపు అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా మహిష్మతి సామ్రాజ్యం మళ్లీ పిక్సెల్స్ రూపంలో పునర్జన్మ పొందబోతుందట. ఇది కేవలం సినిమా కాదు.. భారతీయ సినీ సాంకేతిక పరిజ్ఞానానికి, కథా వైభవానికి ప్రతీకగా నిలిచే ప్రయత్నమని చెప్పాలి.

More from Filmibeat

Read more about: baahubali rajamouli baahubali 3
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X