twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అసలైన ‘మాహిష్మతి సామ్రాజ్యం’ ఇండియాలో ఎక్కడుందో తెలుసా?

    మధ్య ప్రదేశ్ లోని మహేశ్వర్ పట్టణాన్ని పూర్వం మాహిష్మతి అని పిలిచేవారు. రామాయణ, మహాభారతాల్లో ఈ మాహిష్మతి రాజ్య ప్రస్తావన ఉంటుంది.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: 'మాహిష్మతి సామ్రాజ్యం' పేరు వినగానే ఇపుడు అందరికీ గుర్తొచ్చేది 'బాహుబలి' సినిమా. మాహిష్మతి పేరు ఇప్పటి వరకు ఎప్పుడూ వినక పోవడంతో ఇది సినిమా కోసం క్రియేట్ చేసిందని అంతా భావిస్తుంటారు.

    కానీ భారతదేశంలో ఒకప్పుడు మాహిష్మతి పేరుతో ఒక సామ్రాజ్యం ఉండేది అనే విషయం చాలా మందికి తెలియదు. ఒకప్పుడు మాహిష్మతి సామ్రాజ్యంగా పిలవబడే ఆ రాజ్యం ఇపుడు 'మహేశ్వర్‌'గా పిలవబడుతోంది.

    ఎక్కడ ఉంది ఈ ప్రదేశం?

    ఎక్కడ ఉంది ఈ ప్రదేశం?

    మధ్య ప్రదేశ్ లోని మహేశ్వర్ పట్టణాన్ని పూర్వం మాహిష్మతి అని పిలిచేవారు. రామాయణ, మహాభారతాల్లో ఈ మాహిష్మతి రాజ్య ప్రస్తావన ఉంటుంది. ఇది మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని కార్గోన్ జిల్లాలో ఉంది. ఇండోర్ నుండి 91 కిలోమీటర్ల దూరంలో ఈ పట్టణం ఉంది.

    నర్మదా నది తీరంలో

    నర్మదా నది తీరంలో

    నర్మదా నది సమీపంలో ఉన్న సహస్రార్చన మందిరాన్ని దర్శిస్తే ఆ కాలం నాటి గోపురాలు, మందిరాలు, ఆ కాలం నాటి గొప్ప తనాన్ని తెలియజేస్తాయి. ఈ ప్రాచీన పట్టాణాన్ని కార్తీయ వీయాజ్జునుడు తన రాజ్యానికి రాజధానిగా చేసుకుని పరిపాలన చేసే వాడు. ఇప్పటికీ మహేశ్వర్ లోని సహస్రార్చన దేవాలంలో 11 అఖండ దీపాలు నాటి నుండి నేటికీ వెలుగుతూనే ఉండటం విశేషం.

    రాజమాత

    రాజమాత

    18వ శతాబ్దంలో రాజమాత అహల్య భాయ్ హోల్కర్ తన భర్త మరణానంతరం మాహిష్మతి సామ్రాజ్యాన్ని నడిఒడ్డుగా చేసుకుని మాల్వ దేశాన్ని పరిపాలించిందని సమాచారం. శివ భక్తురాలైన అహల్య దేవి ఎన్నో శివాలయాలను పునరుద్దరించింది. వాటిలో గుజరాత్ లోని ఉజ్జయిని, గయ తదితర ఆలయాలు ఉన్నాయి.

    ధర్మరాజు

    ధర్మరాజు

    మాహిష్మతి రాజ్యాన్ని సహర్చాన తర్వాత నిశాధ రాజ్యపు రాజు చేజిక్కించుకుని పరిపాలించాడు. కురుక్షేత్ర యుద్ధం అనంతరం ధర్మరాజు రాజ్యానికి రాజు అయిన తర్వాత మాహిష్మతి రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని యుద్ధం ప్రారంభించాడని, కానీ దాన్ని హస్తగతం చేసుకోలేక పోయాడు అని అంటుంటారు.

    కోట

    కోట

    రాజమాత అహల్య ఈ కోట నుండే అప్పట్లో పాలన సాగించారు. ఈ కోట ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఎంతో అద్భుతంగా ఉండటం ఈ ఫోటోలో చూడొచ్చు.

    బాహుబలి సినిమాలో సెట్టింగుల తరహాలో...

    బాహుబలి సినిమాలో సెట్టింగుల తరహాలో...

    మహేశ్వర్ లోని కట్టడాలను చూస్తుంటే బాహుబలి సినిమాలోని మాహిష్మతి రాజ్యాన్ని చూసిన ఫీలింగే కలగడం గమనార్హం.

    English summary
    According to historical records, Mahishmati is a city likely to have been located in central India, what is now the state of Madhya Pradesh. The city finds mention in numerous records as well as tales, which suggest that it was a capital city and an socio-political centre.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X