twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలి ది కన్‌క్లూజన్ రివ్యూ ( సోషల్ మీడియా).. అసలు కథ ఇదేనా..

    తాజాగా బాహుబలి ది కన్‌క్లూజన్ చిత్ర రివ్యూ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ సమీక్ష నెటిజన్లలో ఆసక్తిని నింపింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    By Rajababu
    |

    బాహుబలి ది కన్‌క్లూజన్ చిత్రం విడుదలకు ముస్తాబవుతున్నది. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఫంక్షన్ ఇప్పటికే హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో వైభవంగా నిర్వహించారు. ఈ చిత్రానికి సంబంధించిన సంచలన కథనాలు మీడియాలో వెలుగు చూస్తున్నాయి. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే విషయంపై ఇప్పటికే యూట్యూబ్‌లో ఫ్యాన్ మేడ్ వీడియో వైరల్‌గా మారాయి.

    సోషల్ మీడియాలో రివ్యూ వైరల్

    సోషల్ మీడియాలో రివ్యూ వైరల్

    ఈ నేపథ్యంలో తాజాగా బాహుబలి ది కన్‌క్లూజన్ చిత్ర రివ్యూ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ సమీక్ష నెటిజన్లలో ఆసక్తిని నింపింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన బాహుబలి2 రివ్యూ ప్రత్యేకంగా వన్‌ఇండియా.కామ్, ఫిల్మీబీట్.కామ్ ప్రత్యేకంగా అందిసున్నది. కథ ఏంటంటే..

    బాహుబలిని నిర్మూలించడానికి..

    బాహుబలిని నిర్మూలించడానికి..

    గిరిజన రాజు కూతురు దేవసేనను బాహుబలి ప్రేమిస్తాడు. కానీ ఆమె నగరానికి రావటానికి నిరాకరిస్తుంది. ఆమెతోనే గడుపుతుంటాడు బాహుబలి. భల్లాల దేవుడు అతడిని ప్రోత్సహించి దేవసేనతోనే ఉండటం న్యాయమంటాడు. కానీ రాజమాతకు మాత్రం లేనిపోనివి నూరిపోస్తాడు. తద్వారా రాజ్యపెత్తనం తాను తీసుకుంటాడు. అక్కడినుంచీ బాహుబలిని నిర్మూలించటానికి ప్రణాళికలు వేస్తాడు.

    భల్లాల దేవుడి కుట్ర..

    భల్లాల దేవుడి కుట్ర..

    తన మనుషులతోనే అరాచకాలు చేయించి అవన్నీ ఆటవికసైన్యం చేస్తోందనీ, వారికి బాహుబలి మద్దతు ఉందనీ చెప్తాడు. దీంతో రాజమాత శివగామి ఆగ్రహిస్తుంది. తన వద్దకు రావాలని బాహుబలిని ఆదేశిస్తుంది. కానీ ఆ ఆదేశాలు బాహుబలికి చేరకుండా భల్లాల దేవుడు కుట్ర చేస్తాడు. ఈ లోగా మాహిష్మతి సైన్యం ఆటవికులను దోచుకోవటం, గిరిజన స్త్రీలను చెరబట్టటం చేస్తుంటుంది. ఇదేమీ శివగామికి తెలియనివ్వకపోగా ఆటవికుల దాడులు అధికమయ్యాయనీ, ప్రజలు ప్రశాంతంగా జీవించలేకపోతున్నారనీ చెప్తుంటారు. దీంతో బాహుబలిని బంధించి తేవాలని రాజమాత ఆదేశిస్తుంది. అదే భల్లాల దేవునికి కావలసింది. సైన్యంతో బయలు దేరుతాడు.

    శివగామి ఆదేశం.. కట్టప్ప వేదన

    శివగామి ఆదేశం.. కట్టప్ప వేదన

    కట్టప్ప కోటకు కాపలాగా ఉంటాడు. భల్లాలదేవుని దండయాత్ర గురించి తెలిసి దేవసేన, బాహుబలి ఎదురువెళతారు. బాహుబలిని చూసి సైన్యం చీలిపోతుంది. భల్లాలదేవుడి దుష్ట అనుచరులు ఒకవేపు, బాహుబలిని అభిమానించే సైన్యం ఓ వైపు. ఈ విషయం రాజమాతకు వేగులు చేరవేయగా ఆమె తీవ్రంగా ఆగ్రహించి రక్తసంబంధం కన్నా రాజ్యమే గొప్పదనీ, బాహుబలిని బంధించి, లేదా అంతం చేసి ఈ యుద్ధానికి ముగింపు పలకాలనీ ఆజ్ఞాపిస్తుంది.

    కట్టప్ప భారమైన మనసుతో.. బాహుబలిని చంపి

    కట్టప్ప భారమైన మనసుతో.. బాహుబలిని చంపి

    కట్టప్ప భారమైన మనసుతో రాజమాత ఆదేశాలతో యుద్ధభూమికి వెళతాడు. అప్పటికే యుద్ధం తీవ్రంగా జరుగుతుంటుంది. భల్లాల దేవుడు ఓడిపోతుంటాడు. బాహుబలి భల్లాల దేవుడిని జయించే సమయంలో కట్టప్ప బాహుబలిని చంపేసి రాణి ఆజ్ఞ పాటిస్తాడు.

    రాజమాత వద్దకు దేవసేన

    రాజమాత వద్దకు దేవసేన

    భల్లాల దేవుడి నుంచి తప్పించుకున్న దేవసేన రాజమాత వద్దకు న్యాయం కోసం బయలు దేరుతుంది. భల్లాలదేవుడు ఆమెను వెంటాడుతూ కోటకు చేరుకుంటాడు. దేవసేన తన బిడ్డను రాజమాతకు అప్పగించి జరిగినదంతా చెపుతుంది. రాజమాత పశ్చాత్తాప పడుతుంది.

    శత్రుశేషం ఉండకూడదని..

    శత్రుశేషం ఉండకూడదని..

    ఆ బిడ్డను కూడా చంపితే శత్రుశేషం ఉండదని భల్లాల దేవుడు, అతడి తండ్రీ అనుకుంటారు. కానీ రాజమాత బిడ్డను తీసుకుని పారిపోతుంది. ఆమె విశ్వాసపాత్రులంతా అప్పటికే బాహుబలితో పాటు చావటమో, అడవిపాలు కావటమో జరిగింది. రాజమాతకే దిక్కులేని పరిస్థితి. ఆమెను వెంటాడుతూ భల్లాల దేవుని అనుచరులు కొండ కిందివరకూ వస్తారు. బాలుడితో సహా రాజమాత నదిలో పడి చనిపోయిందని భల్లాల దేవుడికి చెప్తారు.

    కట్టప్పను బంధించి..

    కట్టప్పను బంధించి..

    అతడు దేవసేనను బంధించి, కట్టప్పను విశ్వాసబంధంలో బిగించి అరాచక పాలన సాగిస్తుంటాడు. తమ బిడ్డను రక్షించుకోవటానికి ఆటవికులు ప్రయత్నాలు చేస్తుంటారు. రెండోబాహుబలి సాయంతో వారు భల్లాల దేవుని ఎలా ఓడించారు.?
    మళ్లీ బాహుబలి ఎలా రాజయ్యాడు.?

    ఇదే కన్‌క్లూజన్ కథ..

    ఇదే కన్‌క్లూజన్ కథ..

    దేవసేన రాజమాతగా మారి శివగామి ఆత్మకు శాంతి ఎలా చేకూర్చింది అన్నది ఊహించదగ్గ కథే కదా .....ఇదే రాజమౌళి సృష్టించిన బాహుబలి కంక్లూజన్...

    కేవలం ఇది సోషల్ మీడియా రివ్యూ మాత్రమే.

    కేవలం ఇది సోషల్ మీడియా రివ్యూ మాత్రమే.

    ప్రస్తుతం ఈ కథ ఎంత మేరకు నిజమో, కాదో తెలియదు కానీ.. ఇంటర్నెట్‌లో విస్తృతంగా ప్రచారమవుతున్నది. ఆటవిడుపు కోసం నెటిజన్లకు అందించడం జరిగింది. ఈ స్టోరి, రివ్యూ సోషల్ మీడియాలో వచ్చినది మాత్రమేనని గమనించాలని ప్రార్థన.

    English summary
    Fan written story, Baahubali Social media Review viral in Internet. Now its become sensational in social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X