»   »  ఈ సెక్స్‌కామెడీ వల్ల ఉన్న పేరు చెడుతుందా..?? శ్రీముఖి, శ్రీనివాస్ ల విచారం

ఈ సెక్స్‌కామెడీ వల్ల ఉన్న పేరు చెడుతుందా..?? శ్రీముఖి, శ్రీనివాస్ ల విచారం

Posted By:
Subscribe to Filmibeat Telugu

అవసరాల శ్రీనివాస్ కి బాబు బాగా బిజీలో హీరో సెక్స్‌ అడిక్ట్‌. కనిపించిన అమ్మాయిలందరితో సెక్స్‌ కావాలని కోరుకుంటాడు. బాలీవుడ్‌లో హిట్‌ అయిన హంటర్‌ అనే చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఇక్కడే వచ్చింది చిక్కు. ఈ సినిమా చేయటం వల్ల కాస్త ఇబ్బంది ఎదురవుతోందట అవసరాలకి దాంతో ఇన్నాళ్ళూ ఉన్న మంచి పేరు ఎక్కడ పోతుందో అన్న విచారం లో ఉన్నాడని చెప్పుకుంటున్నారు...

బాలీవుడ్ లో వర్కౌట్ అవుతాయి

బాలీవుడ్ లో వర్కౌట్ అవుతాయి

రొమాంటిక్ కామెడీలు అనే సెక్స్ కామెడీలు బాలీవుడ్ లో వర్కౌట్ అవుతాయి గానీ టాలీవుడ్ లో కాస్త కష్టమే. ఎందుకంటే దేశవ్యాప్తంగా విడుదలవటం వల్ల బీ, సీ సెంటర్లలో ఆడే అవకాశం ఎక్కువ కాబట్టి కొట్టుకుపోతాయి..., మినిమం నుంచి ఒక మోస్తరు లాభాలని తెచ్చిపెడతాయి.

బూతు సినిమాల కోవలోనే చూస్తారు

బూతు సినిమాల కోవలోనే చూస్తారు

అయితే టాలీవుడ్ లో ఇంకా అంత రేంజ్ రాలేదు. ఇక్కడ ఉన్న పరిమితుల్లో రోమాంటిక్ కామెడీలకి ఆదరణ తక్కువే వీటిని బూతు సినిమాల కోవలోనే చూస్తారు. అదే ఇప్పుడు అవసరాల శ్రీనివాస్ కీ, హీరోయిన్ గా మారిన యాంకర్ శ్రీముఖి కీ చెప్పుకోలేని ఇబ్బందిగా మారిందట

శ్రీముఖి చాలా హాట్‌ సీన్లు చేసిందట

శ్రీముఖి చాలా హాట్‌ సీన్లు చేసిందట

బాబు బాగా బిజీ మూవీలో శ్రీముఖి చాలా హాట్‌ సీన్లు చేసిందని, ఆమెకి ఈ చిత్రం తర్వాత డిఫరెంట్‌ ఇమేజ్‌ వచ్చేస్తుందని మీడియాలో రకరకాలుగా కథనాలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలన్నింటినీ శ్రీముఖి ఖండించింది. సినిమాలో తాను హాట్ సీన్స్ లో చేశానని వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని, తాను అలాంటి సీన్లేమీ చేయలేదని, తన పాత్ర చాలా గౌరవప్రదంగా వుంటుందని, హీరోకి దిశానిర్ధేశం చేసేలాగుంటుందే తప్ప తనపై అభ్యంతరకరమైన సన్నివేశాలుండవని చెప్పింది.

 శ్రీనివాస్ ది ఇంకో టైప్ వర్రీ

శ్రీనివాస్ ది ఇంకో టైప్ వర్రీ

ఇక అవసరాల శ్రీనివాస్ ది ఇంకో టైప్ వర్రీ.... సినిమా పూర్తి చేసిన అవసరాల శ్రీనివాస్‌ ట్రెయిలర్‌ రిలీజ్‌ అయిన దగ్గర్నుంచీ వర్రీ అవుతున్నాడట. ఈ ట్రెయిలర్‌ చూసిన వాళ్లంతా ఎందుకిలాంటిది చేసావని అడుగుతుంటే, తన ధైర్యాన్ని మెచ్చుకుంటారని ఆశించిన అవసరాల షాక్‌ అవుతున్నాడట.

రిగ్రెట్‌ అవుతున్నాడట

రిగ్రెట్‌ అవుతున్నాడట

ట్రెయిలర్‌ పెద్ద హిట్‌ అయి లక్షల కొద్దీ వ్యూస్‌ సాధించిందని నిర్మాతలు సంబరాల్లో మునిగిపోతే, ఈ సినిమా చేయడం పట్ల అవసరాల శ్రీనివాస్‌ రిగ్రెట్‌ అవుతున్నాడట. ఇందులో కాస్త ఘాటుగా అనిపించిన సన్నివేశాలు తొలగించమని రిక్వెస్ట్‌ చేస్తున్నాడట. ఇన్నాళ్ళూ ఉన్న మంచి పేరు ఎక్కడ పోతుందో అన్న విచారం లో ఉన్నాడని చెప్పుకుంటున్నారు.

 తల పట్టుకుని కూర్చున్నాడు

తల పట్టుకుని కూర్చున్నాడు

కానీ ట్రెయిలర్‌ చూసిన బయ్యర్లు ఈ చిత్రం నుంచి చాలా హాటైన సీన్లు ఆశిస్తున్నారు కనుక ఆ మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు ఎడిటింగ్‌కి సమ్మతించకపోవచ్చు. తన బోల్డ్‌ మూవ్‌ ట్రెండ్‌ సెట్‌ చేస్తుందని అనుకుంటే రివర్స్‌లో మెడకి చుట్టుకునే సరికి అవసరాల తల పట్టుకుని కూర్చున్నాడు.

English summary
Avasarala Srinivas worried about his new Movie Baabu Baaga Busy wich is Going to be release soon as a sex comedy...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu