»   » వెంకీ, మారుతిలను ఇబ్బందుల్లోకి నెట్టిన నయనతార!

వెంకీ, మారుతిలను ఇబ్బందుల్లోకి నెట్టిన నయనతార!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వెంకటేష్ సోలోగా సినిమా చేసి చాలా కాలం అయ్యింది. 'దృశ్యం' తర్వత మరే సినిమా చెయ్యలేదు. ప్రస్తుతం మారుతి డైరక్షన్ లో 'బాబు బంగారం' (వర్కంగ్ టైటిల్) సినిమా చేస్తున్నారు వెంకటేష్. ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా, స్పీడ్ గా సాగిపోతోంది.

ఈ సినిమా షూటింగ్ మార్చి వరకు పూర్తి చేసి... సమ్మర్లో మంచి టైం చూసి రిలీజ్ చేద్దామనుకున్నారు. అయితే షూటింగ్ ముందుగా అనుకున్న ప్రకారం జరుగడం లేదట. కారణం ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న నయనతారే అని అంటున్నారంతా. వాస్తవానికి నయనతార ఫిబ్రవరిలోనే షూటింగులో జాయిన్ కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఇంకా షూటింగులో జాయిన్ కాలేదని అంటున్నారు.

నయనతార తమిళంలో ముందుగా కమిట్ అయిన ప్రాజెక్టుల్లో బిజిగా గడపటం వల్ల ముందుగా అనుకున్న ప్రకారం ఫిబ్రవరిలో షూటింగులో జాయిన్ కాలేక పోయిందని టాక్. మారుతి ఇప్పటికే షూటింగ్ దాదాపుగా కంప్లీట్ చేసాడు. నయనతారకు సంబంధించిన పోర్షన్ మాత్రమే పెండింగులో ఉందట.

Babu Bangaram filming halt because of Nayanatara

ఇప్పటికే నయనతారకు రెమ్యూనరేషన్ భారీగా చెల్లించారు. ఇపుడు ఆమె వల్ల షూటింగు కూడా ఆలస్యం అవుతుండటంతో నిర్మాతలకు ఖర్చు తడిచిమోపెడవుతోందట. ఈ నెలలో నయనతార షూటింగులో జాయిన్ కాకపోతే సినిమా రిలీజ్ మరింత ఆలస్యం అవడం ఖాయం అంటున్నారు.

మరో వూపు బిజినెస్ సైతం చాలా ఊపుగా , స్పీడుగా ,సైలెంట్ గా జరుగుపోతోందని సమాచారం. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబందించి ఉత్తరాంధ్ర బిజినెస్ జరిగిపోయిందని, దీనికి ఓ మంచి ఫ్యాన్సీ ఎమౌంట్ తో భారతి పిక్చర్స్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.

నయనతార లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా మంచి హిట్ అవుతుందని, గతంలో వెంకటేష్, నయనతారా కాంబినేషన్ లో వచ్చిన లక్ష్మి, తులసి సినిమాలు సూపరు హిట్ అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే మంచి హిట్స్ తో ముందుకు దూసుకుపోతున్న డైరక్టర్ మారుతి ఈ ఫ్యామిలి సినిమాతో ఏ రేంజిలో మాయా చెస్తాడో అని ట్రేడ్ వర్గాలు చర్చించుకుంటున్నారు. ఎస్ రాధాకృష్ణ సమర్పణలో సితార ఎంటర్‌టైనమెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

English summary
Maruthi has completed rest of the shoot except for the portions involving Nayanatara and Babu Bangaram filming came to a halt because of her. They have paid a bomb for Nayanatara who has been ruling the roost in Tamil cinema.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu