»   » సర్జరీ చేయించుకోవాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్‌?

సర్జరీ చేయించుకోవాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్‌?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం విడుదలై చాలా రోజులైనా....ఆయన తర్వాత సినిమా 'గబ్బర్ సింగ్ -2' చిత్రం ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. పవన్ కళ్యాణ్ వెన్ను నొప్పితో బాధ పడుతుండటం వల్లనే ఈ సినిమా ప్రారంభం లేటవుతుందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

కాగా... ఫిల్మ్ నగర్లో ఇందుకు సంబంధించి మరో వార్త చక్కర్లు కొడుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా వెన్ను నొప్పితో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ ఎన్ని రకాలుగా ఆయుర్వేద చికిత్స, ఫిజియో తెరపీ చికిత్స తీసుకున్నా కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఉంటోందని....ఈ సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఆయన సర్జరీని ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియదు కానీ, పవన్ త్వరగా ఈ సమస్య నుండి కోలుకోవాలని ఆశిద్దాం.

Pawan Kalyan

గబ్బర్ సింగ్ 2 సినిమా వివరాల్లోకి వెళితే....ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ స్నేహితుడు శరత్ మరార్ ఈచిత్రానికి నిర్మాత. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ స్పెషల్ కేర్ తీసుకోవడమే కాకుండా దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేయనున్నారు.

ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ కాలేదు త్వరలోనే ఎవరనేది ప్రకటించే అవకాశం ఉంది. గబ్బర్ సింగ్ చిత్రం హిందీ దబాంగ్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కించినప్పటికీ....'గబ్బర్ సింగ్-2' మాత్రం హిందీ దబాంగ్-2‌ను పోలి ఉండదని అంటున్నారు దర్శకుడు సంపత్ నంది.

English summary
Film Nagar gossip is that, Pawan Kalyan ready for surgery. Pawan Kalyan has a back problems for many years. He is currently being treated for it and is undergoing physiotherapy regularly.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu