For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాలకృష్ణ 'లయన్‌' నిర్మాత కంగారుపడే...?

  By Srikanya
  |

  హైదరాబాద్ : గతేడాది 'లెజెండ్‌'తో విజయాన్ని సొంతం చేసుకొన్న బాలకృష్ణ త్వరలో 'లయన్‌'గా సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే . బాలకృష్ణ హీరోగా సత్యదేవా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'లయన్‌'. త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్స్. రుద్రపాటి రమణారావు నిర్మాత. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని రీసెంట్ గా జెమినీ ఛానెల్ కు ఐదున్నర కోట్లుకు అమ్మారని ట్రేడ్ వర్గాల సమాచారం. అయితే రిలీజైతే ఇంకా ఎక్కువ వచ్చేది కదా...కంగారు పడి అమ్మేసారా అంటున్నారు కొందరు. అయితే ఐదున్నర కోట్లుకి శాటిలైట్ అమ్మటం అనేది మామూలు విషయం కాదని, మంచి రేటే అని సినిమా వాళ్లు అంటున్నారు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  దర్శకుడు మాట్లాడుతూ... ''సామాన్యుడికి బాసటగా నిలిచే ఓ వ్యక్తి కథతో రూపొందుతున్న చిత్రమిది. శక్తిమంతమైన పాత్రతో మరోసారి అలరించబోతున్నారు బాలకృష్ణ. ''అని తెలిపారు.

  ఇటీవల హైదరాబాద్‌లో హీరో పరిచయ సన్నివేశాల్ని భారీస్థాయిలో తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు.

  Bala Krishna's Lion Satellite Rights Sold

  న్యూ ఇయర్ కానుకగా ఫస్ట్ టీజర్ రూపంలో నందమూరి బాలకృష్ణ తన ‘లయన్' ఇప్పటికే పరిచయం చేసారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో త్రిషతో పాటు రాధిక ఆప్టే కూడా మరో హీరోయిన్ గా కనిపించనుంది. సత్యదేవా దర్శకుడుగా పరిచయమవుతూ చేసిన ఈ సినిమాకి రుద్రపాటి రమణారావు నిర్మాత.

  నిర్మాత మాట్లాడుతూ.. '''లెజెండ్' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాలకృష్ణ మా సినిమా చేయడం ఆనందంగా ఉంది. బాలయ్య ఇమేజ్‌కి తగ్గట్టుగా శక్తిమంతమైన కథను సత్యదేవ్ సిద్ధం చేశారు. ఈ చిత్రంతో తను అగ్ర దర్శకుల జాబితాలో చేరడం ఖాయం. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో భారీ నిర్మాణ విలువలతో మేం నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం నటిస్తున్నారు.'' అని చెప్పారు.

  'లెజెండ్' తర్వాత బాలకృష్ణ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉండటం సహజం. అందుకు తగ్గట్టుగానే అత్యంత శక్తిమంతంగా ఇందులోని బాలయ్య పాత్ర ఉండబోతోందని వినికిడి. సత్యదేవ్ సంభాషణలు కూడా ఈ సినిమాకు హైలైట్‌గా నిలువనున్నాయని సమాచారం. గన్ నుంచి విడుదలయ్యే బుల్లెట్‌కి దయా దాక్షిణ్యాలుండవ్. దానికి తెలిసిందల్లా లక్ష్యం ఒక్కటే. దాన్ని ఛేదించేదాకా అది వదలదు. ఈ లక్షణాలతో ఓ పాత్రను సృష్టిస్తే? ఆ పాత్రను బాలకృష్ణ పోషిస్తే? ఇక అభిమానులకు అంతకంటే కావల్సిందేముంటుంది! సత్యదేవ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రంలో బాలకృష్ణ అలాగే కనిపించనున్నారని చెప్తున్నారు.

  బాలయ్య సరసన తొలిసారి త్రిష ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎస్.ఎల్.వి.సినిమా పతాకంపై రుద్రపాటి రమణరావు నిర్మిస్తున్నారు. చంద్రమోహన్, జయసుధ, ప్రకాశ్‌రాజ్, అలీ, గీత తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్‌ప్రసాద్, సంగీతం: మణిశర్మ, కూర్పు: గౌతంరాజు, సమర్పణ: రుద్రపాటి ప్రేమలత.

  English summary
  Nandamuri Balakrishna's Upcoming action film LION satellite rights taken by Gemini T.V. for 5.5 crores
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X