»   »  హ్యాపీ న్యూస్: సీక్వెల్ కు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్

హ్యాపీ న్యూస్: సీక్వెల్ కు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ అభిమానులకు మాత్రమే కాదు...సినీ అభిమానులకు సైతం ఇష్టమైన చిత్రం 'ఆదిత్య 369'. ఈ చిత్రానికి సీక్వెల్ వస్తే బాగుంటుందని చాలా కాలంగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య ఈ విషయమై వార్తలు సైతం వచ్చాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

గత కొద్ది రోజులుగా....ఈ కథని బాలకృష్ణ కొనసాగించడంపై దృష్టిసారించారు. కానీ ఎందుకో ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడందుకు ముహూర్తం కుదిరిందని సమాచారం. 'ఆదిత్య 369'కి కొనసాగింపుగా 'ఆదిత్య 999' కథ పూర్తిస్థాయిలో సిద్ధమైందని సమాచారం. ఈ చిత్రంలో నటించడానికి బాలకృష్ణ ఉత్సాహంగా ఉన్నారని చెప్తున్నారు.

Balakrishna green signal to Aaditya 999

ఇటీవల సింగీతం శ్రీనివాసరావు బాలకృష్ణకు ఆ కథ వినిపించారని, బాలకృష్ణ ఆమోద ముద్ర వేశారని తెలుస్తోంది. ప్రస్తుతం 'డిక్టేటర్‌'తో బిజీగా ఉన్నారు బాలకృష్ణ. ఆ తరవాత వందో చిత్రం ఉంటుంది. 101వ చిత్రంగా 'ఆదిత్య 999' పట్టాలెక్కే అవకాశాలున్నాయి.

'ఆదిత్య 369' లో ఈ చిత్ర దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాల్ని చూపించేశారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి తీసుకెళ్లారు. రూ.1500 పెట్టి కిలో టమోటాలు కొనుక్కొనే భయంకరమైన భవిష్యత్తునూ కళ్లకు కట్టారు. మరి ఈ సారి సింగీతం గారు ఏం చూపనున్నారో...ఏం వెరెటైలు చేయనున్నారో చూడాల్సిందే.

English summary
Balakrishna gave green signal to Aditya 999, the sequel of 1991 super hit. Sangeetam Srinivasa Rao, who directed the original, will be directing the sequel too.
Please Wait while comments are loading...