For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టాలీవుడ్‌లో సెన్సేషనల్ కాంబో: పవన్ డైరెక్టర్‌తో బాలయ్య.. ఆ మూవీని మించిన యాక్షన్‌తో!

  |

  టాలీవుడ్‌లో ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. కెరీర్ ఆరంభం నుంచీ ఇదే పద్దతిని ఫాలో అవుతోన్న ఆయన.. ఆరు పదుల వయసులోనూ రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు. ఇలా ఇప్పటికే పలు ప్రాజెక్టులను అధికారికంగా ప్రకటించేశారు. ఈ క్రమంలోనే బాలయ్య ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్‌తో సినిమా చేయడానికి పచ్చజెండా ఊపేశారని తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఇంతకీ ఎవరా డైరెక్టర్? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ అందరి కోసం!

  అఖండతో బాలయ్య హిట్ ట్రాక్

  అఖండతో బాలయ్య హిట్ ట్రాక్

  వరుసగా ఫ్లాపులతో సతమతమైన సమయంలోనే నటసింహా నందమూరి బాలకృష్ణ గత ఏడాది 'అఖండ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బోయపాటి శ్రీను రూపొందించిన ఈ ప్రతిష్టాత్మక సినిమా భారీ అంచనాలతో వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో బాలయ్య మరోసారి హిట్ ట్రాక్ ఎక్కారు. అంతేకాదు, ఈ చిత్రంతో కలెక్షన్ల పరంగా రికార్డులు కొట్టేశారు.

  అషు రెడ్డి 'కామం' వీడియో వైరల్: వాళ్లకు మాత్రమేనట.. కింద కామెంట్స్ చూశారంటే!

  వీరసింహారెడ్డిగా బాలయ్య మాస్

  వీరసింహారెడ్డిగా బాలయ్య మాస్


  'అఖండ' తర్వాత నటసింహా బాలకృష్ణ మరింత ఉత్సాహంతో దూసుకెళ్తోన్నారు. దీంతో ఫ్యూచర్ ప్రాజెక్టులను సైతం లైన్‌లో పెట్టుకున్నారు. ఇందులో 'క్రాక్' మూవీ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో 'వీరసింహారెడ్డి' అనే సినిమా చేస్తున్నారు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ స్పీడుగా నడుస్తోంది.

  అనిల్ రావిపూడితో క్రేజీ మూవీ

  అనిల్ రావిపూడితో క్రేజీ మూవీ

  'వీరసింహారెడ్డి' షూటింగ్ జరుగుతుండగానే బాలయ్య.. అనిల్ రావిపూడితో నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రాజెక్టును చేయబోతున్నారు. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడింది. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది దీన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. దీనికి 'రామారావు గారు' అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

  డోసు పెంచేసిన జబర్దస్త్ వర్ష: ముందూ వెనుక ఏమీ లేకుండా హాట్ షో

  అన్‌స్టాపబుల్ షోలో అరాచకం

  అన్‌స్టాపబుల్ షోలో అరాచకం

  దాదాపు నలభై ఏళ్లుగా టాలీవుడ్‌లో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న బాలయ్య.. 'Unstoppable with NBK' షోతో హోస్టుగా మారారు. ఇందులో ఆయన అదిరిపోయే హోస్టింగ్ చేస్తున్నారు. తొలి ప్రయత్నమే అయినా వచ్చిన గెస్టులతో పాటు ప్రేక్షకులను అలరించారు. దీంతో మొదటి సీజన్‌లోని ఎపిసోడ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఇప్పుడు రెండోది నడుస్తోంది.

  హరీష్ శంకర్‌తో బాలయ్య మూవీ

  హరీష్ శంకర్‌తో బాలయ్య మూవీ

  ప్రస్తుతం రెండు సినిమాలను లైన్‌లో పెట్టుకున్న నటసింహా నందమూరి బాలకృష్ణ.. త్వరలోనే మరో భారీ సినిమాలో నటించబోతున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన మరింత సమాచారం లీకైంది. తాజా సమాచారం ప్రకారం.. బాలయ్య.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్‌తో భారీ ప్రాజెక్టును చేయబోతున్నారని తెలిసింది.

  పెళ్లైన కొత్తలోనే హీరోయిన్ పూర్ణకు షాక్: బయటపడిన భారీ మోసం.. తన భర్త ఎలాంటి వాడో చెబుతూ పోస్ట్

  మైత్రీ మూవీ మేకర్స్ భారీ ప్లాన్

  మైత్రీ మూవీ మేకర్స్ భారీ ప్లాన్

  నటసింహా నందమూరి బాలకృష్ణతో హరీష్ శంకర్ చేయబోయే సినిమా టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించబోతుందని కూడా తెలిసింది. ఇప్పటికే ఆ నిర్మాతలు బాలయ్యతో 'వీరసింహారెడ్డి' అనే మూవీ చేస్తున్నారు. దీనితో పాటు ఇప్పుడు హరీశ్ శంకర్‌ కాంబోని కూడా సెట్ చేశారు. ఇక, ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతుందని సమాచారం.

  పవన్ సినిమాను పక్కన పెట్టేసి

  పవన్ సినిమాను పక్కన పెట్టేసి

  వాస్తవానికి హరీష్ శంకర్ చాలా రోజుల క్రితమే పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో 'భవదీయుడు భగత్ సింగ్' మూవీని ప్రకటించారు. కానీ, ఇది మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉండడంతో.. ఈ డైరెక్టర్ దాన్ని పక్కన పెట్టేసి బాలయ్యతో జత కడుతున్నాడట. ఇక, ఈ చిత్రాన్ని పోలీస్ స్టోరీతోనే 'గబ్బర్ సింగ్' మూవీని మించిపోయేలా రూపొందించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

  English summary
  Nandamuri Balakrishna Doing Several Films At A Time. after these Projects.. He Will Do a Movie With Harish Shankar Direction.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X