For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాలయ్య 'డిక్టేటర్‌': సాంగ్ రిలీజ్ ప్లాన్ కొత్తగా ,వెన్యూ ఎక్కడంటే

  By Srikanya
  |

  హైదరాబాద్ :నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం 'డిక్టేటర్‌'. అంజలి, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్స్. శ్రీవాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం యూరప్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రం టీజర్ ని వినాయిక చవితికి విడుదల చేయనున్నారని సమాచారం. అలాగే ఈనెల 17న వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని 'డిక్టేటర్‌'లోని 'గం గం గం గణేశా..' అనే గీతాన్ని విడుదల చేయబోతున్నారు. ఖైరతాబాద్‌ గణేశుని విగ్రహం సమక్షంలో, ఈ పాటని ఆవిష్కరించనున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  దర్శకుడు మాట్లాడుతూ.... అతని మాటెప్పుడూ బాణంలా దూసుకుపోతుంది. అది చట్టంలా నిలిచిపోతుంది. శాసనంగా మిగిలిపోతుంది. అతడే.. 'డిక్టేటర్‌'. నీతి తప్పిన సమాజానికి నియంతలా మారిన అసలు సిసలైన నాయకుణ్ని మా సినిమాలో చూడండి అంటున్నారు శ్రీవాస్‌.

  ''నా తొలి చిత్రం'లక్ష్యం' పూర్తయిన వెంటనే బాలకృష్ణగారితో సినిమా చేయాలనుకొన్నా. కానీ అప్పట్లో కుదరలేదు. అది ఒక రకంగా మంచికే అయ్యింది. ఇప్పుడు బాలకృష్ణగారి సినిమాకి దర్శకత్వం వహిస్తుండడంతోపాటు, నిర్మాణంలోనూ భాగం పంచుకొనే అవకాశం దొరికింది. బాలకృష్ణ ఇదివరకు కుటుంబ ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు చేశారు, అభిమానుల్ని అలరించే చిత్రాలూ చేశారు. మేం ఈ సినిమాని ప్రతి అభిమాని తమ కుటుంబంతో కలసి చూసేలా తీయబోతున్నాం. బాలకృష్ణ రెండు కోణాల్లో సాగే పాత్ర పోషిస్తున్నారు. ఆయన 99వ సినిమా కాబట్టి మరింత బాధ్యతతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నా. ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ తొలిసారి తెలుగులో నిర్మిస్తున్న సినిమా ఇదే'' అన్నారు దర్శకుడు.

  నిర్మాత మాట్లాడుతూ '''డిక్టేటర్‌' పేరులో ఎంత శక్తి ఉందో అంతే శక్తి బాలకృష్ణ పాత్రలోనూ ఉంటుంది. ఆయన్ని చాలా స్త్టెలిష్‌గా, అభిమానులు మెచ్చేలా చూపించబోతున్నాము''అన్నారు.

  Balakrishna's Dictator Teaser for Vinayaka Chaviti

  బాలకృష్ణ మాట్లాడుతూ ''ఈ సినిమా పేరు చాలా బలమైనది. అందుకు తగ్గట్టుగానే కథని తయారు చేశారు. ఇంతకు ముందున్న రికార్డుల్ని తిరగరాసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు దర్శకుడు. ప్రాణం తీసే భయం కన్నా ప్రాణం పోసే ఆయుధం గొప్పదనే కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకొంటున్న ఈ సినిమా ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుంది. మంచి కథకి, మంచి నటీనటులు, సాంకేతికబృందం తోడైంది. గత చిత్రాల్లాగే ఇదీ మంచి విజయాన్ని సొంతం చేసుకొంటుంద''న్నారు.

  అంజలి మాట్లాడుతూ ''తొలిసారి బాలకృష్ణగారితో కలిసి నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇదివరకు ఎప్పుడూ చేయని ఓ విభిన్నమైన పాత్రని ఇందులో పోషిస్తున్నాను''అన్నారు.

  రచయిత కోన వెంకట్‌ మాట్లాడుతూ ''బాలకృష్ణగారి సినిమాకి కథ అందించడం ఆనందంగా ఉంది. ఆయన చేసిన సినిమాల్ని గుర్తు చేసుకొంటూ వాటికి దీటుగా ఉండేలా ఈ కథని మలిచాం. బాలకృష్ణ పాత్ర హుందాగా ఉంటుంది. కుటుంబ ప్రేక్షకుల్ని అలరించేలా మంచి వినోదాన్నీ పండించబోతున్నార''న్నారు.

  వేదాశ్వ క్రియేషన్స్‌, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ రూపొందిస్తున్నాయి. ప్రస్తుతం యూరప్‌లో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ బాలకృష్ణ, ఇతర ప్రధాన తారాగణంపై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. 'డిక్టేటర్‌'లో దాదాపు సగభాగం యూరప్‌ నేపథ్యంలోనే సాగుతుంది. పాటలూ, పోరాట ఘట్టాలనీ అక్కడే తెరకెక్కిస్తారు.

  నందమూరి బాలకృష్ణ, అంజలి, నాజర్, బ్రహ్మానందం, రవి కిషన్, కబీర్, వెన్నెల కిషోర్, పృథ్వి, కాశీ విశ్వనాథ్, ఆనంద్, సుప్రీత్ అమిత్ తదితరులు నటిస్తున్నారు. ప్రొడ్యూసర్: ఏరోస్ ఇంటర్నేషనల్, కోప్రొడ్యూసర్: వేదాశ్వ క్రియేషన్స్, డైరెక్టర్: శ్రీవాస్, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్, మాటలు: ఎం. రత్నం, రచన: శ్రీధర్ సీపాన, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, మ్యూజిక్: థమన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మకడలి, ఫైట్స్: రవివర్మ, స్టిల్స్: అన్బు, పి.ఆర్.ఓ: వంశీ శేఖర్.

  English summary
  Balakrishna is busy shooting for the film Dictator. A song of this film will also be released on the auspicious festival of Vinayaka Chaviti (Sep 17). The venue of this teaser and song launch will happen at the famous pandal at Khairatabad.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X