»   » నిజమా? బాలయ్య ‘మే’డే గిఫ్టు ఇస్తున్నారా?

నిజమా? బాలయ్య ‘మే’డే గిఫ్టు ఇస్తున్నారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సత్య దేవ దర్శకత్వంలో ‘లయన్' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తొలుత ఈ చిత్రం ఆడియో రిలీజ్ మార్చి 28 విడుదల చేసేందుకు ప్లాన్ చేసారు. అయితే ఏపీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించేందుకు ఏప్రిల్ 9కి వాయిదా వేసినట్లు సమాచారం. శిల్పకళా వేదికలో ఆడియో వేడుక ఘనంగా జరపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Balakrishna's Lion to release on May 1st

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైనట్లు చెబుతున్నారు. మే 1వ తేదీన కార్మిక దినోత్సవం సందర్భంగా సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ విషయం అఫీషియల్ గా ఖరారు కావాల్సి ఉంది. ఈచిత్రం బాలయ్య అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.


బాలయ్య సరసన తొలిసారి త్రిష ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎస్.ఎల్.వి.సినిమా పతాకంపై రుద్రపాటి రమణరావు నిర్మిస్తున్నారు. చంద్రమోహన్, జయసుధ, ప్రకాశ్‌రాజ్, అలీ, గీత తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్‌ప్రసాద్, సంగీతం: మణిశర్మ, కూర్పు: గౌతంరాజు, సమర్పణ: రుద్రపాటి ప్రేమలత, దర్శకత్వం: సత్యదేవా.

English summary
Nandamuri Balakrishna's action entertainer Lion has completed talkie part except for a few patch works. According to the latest update from the movie unit, audio album will be launched on 9th April where AP CM Nara Chandrababu Naidu will grace the function as chief guest.
Please Wait while comments are loading...