»   »  బాలకృష్ణ కొత్త చిత్రం ముహూర్తం తేదీ

బాలకృష్ణ కొత్త చిత్రం ముహూర్తం తేదీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్:విజయోత్సాహంలో ఉన్నారు బాలకృష్ణ. ఆయన నటించిన 'లెజెండ్‌' ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అభిమానులను అలరిస్తూ చక్కటి ఆదరణ పొందుతోంది. దీంతో బాలయ్య ఖాతాలో మరో విజయం చేరినట్త్టెంది. తాజాగా మరొక కొత్త చిత్రానికి పచ్చజెండా వూపారాయన. సత్యదేవా దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నారు. ఎస్‌.ఎల్‌.వి. సినిమా పతాకంపై రుద్రపాటి రమణరావు నిర్మించబోతున్నారు. ఈ చిత్రం మే 9 న గ్రాండ్ గా లాంచ్ కానుంది. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Balakrishna’s movie muhurtham will be on May 9th

గతంలో మణిశర్మ,బాలకృష్ణ కాంబినేషన్ లో నరసింహనాయుడు, సమరసింహా రెడ్డి, లక్ష్మీ నరసింహా వంటి చిత్రాలు వచ్చి మ్యూజికల్ గానూ విజయవంతమయ్యాయి. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ తో ఈ చిత్రం రెడీ అవుతోందని సమాచారం. ''బాలకృష్ణ శైలికి తగ్గ కథ ఇది. కుటుంబ అనుబంధాలతోపాటు అభిమానుల్ని అలరించే అన్ని అంశాలూ ఇందులో ఉంటాయి. సాంకేతిక విలువలకు ప్రాధాన్యమిస్తూ భారీ వ్యయంతో రూపొందించబోతున్నాం. ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు త్వరలోనే తెలియజేస్తాము''అని నిర్మాతలు తెలిపారు.

'లెజెండ్‌' పూర్తయిన తరవాత బాలయ్య కొంతకాలం విశ్రాంతి తీసుకొనే అవకాశం ఉందని వినపడింది. అయితే ఇప్పుడది లేనట్లే. ఎన్నికలు దగ్గర కి రావటంతో ఆయన అవసరం పార్టీకి చాలా ఉంది. 'లెజెండ్‌' తరవాత ఎన్నికల సంగ్రామంలో దిగడానికి రెడీగా ఉన్నారు. 'లెజెండ్‌'ని ఎన్నికల్లో ఓ ప్రధాన అస్త్రంగా సంధిస్తున్నారు. మరోవైపు సెంచరీ చిత్రానికి బాలయ్య దగ్గరపడుతున్నారు. ఆ చిత్రం ప్రత్యేకంగా ఉండాలన్నది ఆయన అభిమతం. వీలైతే... బోయపాటి శ్రీను ఆ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే... అభిమానులకు ఆయన బంపర్‌ ఆఫర్‌ ఇచ్చినట్టే.

English summary
Satyadev, who is a newcomer, is going to direct Balakrishna’s movie and the muhurtham ceremony will be on May 9th. Now after a gap,Manisharma teaming up again and this is for Balakrishna’s upcoming film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu