»   » బాలకృష్ణకు... ఫేడవుట్ బ్యాచ్ దిక్కయ్యారు

బాలకృష్ణకు... ఫేడవుట్ బ్యాచ్ దిక్కయ్యారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హీరోయిన్స్ సమస్య సీనియర్ హీరోలకు ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైంది. వారి ఏజ్ గ్రూప్ కు తగ్గ హీరోయిన్స్ ని ఎంపిక చేయటం కష్టమైపోతోంది. ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ ని తీసుకుందామంటే వారంతా చిన్నవారు అవుతూంటారు. దాంతో ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్స్ దిక్కవుతూండటం జరుగుతోంది. బాలకృష్ణ కు గత కొంతకాలంగా ఇదే సమస్య ఎదురవుతోంది. ఆయన ప్రక్కన చేయటానికి హీరోయిన్స్ వెతకాల్సిన పరిస్ధితి ఎదురౌతోంది. నయనతార మాత్రమే ఆయన ప్రక్కన చేసిన వారిలో సరైన జోడి అనిపించింది. ఇప్పుడు ఫేడ్ అవుట్ అయిన త్రిష, శ్రియ లలో ఎవరో ఒకరిని ఎంపిక చేసుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడింది.

నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ సినిమా సిద్ధమవుతోంది. ఇప్పటికే కథ, దర్శకుడు ఎంపిక పూర్తికాగా ఇప్పుడు హీరోయిన్ కోసం దర్శక,నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. త్రిష లేదా శ్రియలలో ఒకరిని హీరోయిన్ గా ఎంపిక చేస్తారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. తొలుత ఈ పాత్రలో అంజలిని అనుకున్నా తర్వాత నిర్ణయం మారింది. సత్యదేవ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్నారు. బాలకృష్ణ జన్మదినం సందర్భంగా జూన్‌ 10న సినిమాను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Balkrishna's Heroine Issue

గతంలో మణిశర్మ,బాలకృష్ణ కాంబినేషన్ లో నరసింహనాయుడు, సమరసింహా రెడ్డి, లక్ష్మీ నరసింహా వంటి చిత్రాలు వచ్చి మ్యూజికల్ గానూ విజయవంతమయ్యాయి. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ తో ఈ చిత్రం రెడీ అవుతోందని సమాచారం. ''బాలకృష్ణ శైలికి తగ్గ కథ ఇది. కుటుంబ అనుబంధాలతోపాటు అభిమానుల్ని అలరించే అన్ని అంశాలూ ఇందులో ఉంటాయి. సాంకేతిక విలువలకు ప్రాధాన్యమిస్తూ భారీ వ్యయంతో రూపొందించబోతున్నాం. ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు త్వరలోనే తెలియజేస్తాము''అని నిర్మాతలు తెలిపారు.

English summary
Shriya Saran would be doing the female leads in Balakrishna's Godsey directed by debutante Satya Dev. Still it's not clear whether Trisha is replacing Shriya Saran.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu