Just In
- 2 min ago
టాలీవుడ్ యంగ్ హీరోపై కేసు నమోదు: నమ్మించి మోసం చేశాడంటూ ఫిర్యాదు.. స్పందించకపోవడంతో!
- 10 hrs ago
స్వర్గమంటూ ఉంటే అదే ఇది.. మాల్దీవుల్లో యశ్ రచ్చ.. అందుకే వెళ్లాడా?
- 10 hrs ago
త్రివిక్రమ్-రామ్ సినిమా.. అది అతడినే అడగాలి.. స్రవంతి రవికిశోర్ కామెంట్స్ వైరల్
- 11 hrs ago
‘భూమి’పై కాజల్ వీడియో.. జయం రవి కోసం స్పెషల్ పోస్ట్
Don't Miss!
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- News
జో బైడెన్ రాకముందే డొనాల్ ట్రంప్ జంప్: కరోనా, నిరుద్యోగితలే అధ్యక్ష భవనానికి దూరం నెట్టాయి
- Finance
Gold prices today : బంగారం ధరల్ని అక్కడే నిలిపిన వ్యాక్సీన్!
- Sports
భారత్ పోరాటం ముందు నిలవలేకపోయాం: ఆసీస్ కెప్టెన్
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బెల్లంకొండ హీరో తగ్గట్లేదుగా.. బాలీవుడ్ ఎంట్రీ కోసం బాహుబలి రైటర్
బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఎలా ఉంటుందో గాని హైప్ మాత్రం మామూలుగా లేదు. రోజుకో రూమర్ సోషల్ మీడియాలలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కెరీర్ మొదటి నుంచి కూడా వరుసగా బిగ్ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్న సాయి శ్రీనివాస్ ఈ సారి అంతకుమించి అన్నట్లుగా ప్లాన్ చేసుకుంటున్నాడు. డబ్బింగ్ సినిమాల హవాతో నార్త్ ఆడియెన్స్ కొంత ఆకర్షించిన ఈ హీరో ఏకంగా ఛత్రపతి కథతో డైరెక్ట్ గా బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు.
అయితే సినిమాను రీమేక్ చేసే దర్శకుడు ఎవరు అనేది హాట్ టాపిక్ గా మారుతున్న సమయంలో రైటర్ విషయంలో చిత్ర యూనిట్ ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి సినిమాలకు మొదటి నుంచి వర్క్ చేస్తున్న ఆయన తండ్రి కె.విజయేంద్రప్రసాద్ బెల్లంకొండ సినిమా కోసం మరోసారి ఛత్రపతికి రైటర్ గా వర్క్ చేయబోతున్నట్లు సమాచారం. ఛత్రపతి అసలు కథ ఆయనేదే. అయితే బాలీవుడ్ ఆడియెన్స్ అభిరుచికి తగ్గట్లుగా సినిమా స్క్రీన్ ప్లేలో మార్పులు చేయనున్నారట.

ఇక దర్శకుడిగా వివి.వినాయక్ అయితే బెటర్ అని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ముందుగా సుజిత్ కి ఆఫర్ ఇచ్చినప్పటికీ.. అతను ఒప్పుకోలేదట. ఎలాంటి రీమేక్స్ చేయడం లేదని ఇటీవల క్లారిటీ కూడా ఇచ్చేశాడు. ఇక ఇప్పుడు వినాయక్ తో పాటు రచయిత విజయేంద్రప్రసాద్ కలిసి వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ ఛాన్సును ఏ మాత్రం మిస్ చేసుకోవద్దని అనుకుంటున్నాడు. టాలీవుడ్ లో బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన ఛత్రపతి ప్రభాస్ మార్కెట్ ని ఒక్కసారిగా పెంచేసింది. మరి బెల్లంకొండ హీరోకు ఆ కథ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.