Don't Miss!
- Sports
నాదల్ రికార్డు సమం చేసి.. మళ్ళీ నంబర్ వన్ ర్యాంక్ చేరుకున్న జోకొవిక్..!
- Finance
India imf: శభాష్ ఇండియా అంటూ IMF ప్రశంసలు.. ప్రపంచ ఆర్థికంలో మన వాటా ఎంతంటే..?
- News
మోదీ సర్కార్‌పై బీఆర్ఎస్ ప్రత్యక్ష యుద్ధం..!!
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
బెల్లంకొండ శ్రీనివాస్ ముందే రాబోతున్నాడా.. అల్లుడు అదుర్స్ సరికొత్త ప్లాన్?
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజుల తరువాత బాక్సాఫీస్ ఫైట్ మొదలవ్వబోతోంది. రవితేజ, రామ్ పోతినేని అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ సంక్రాంతిని టార్గెట్ చేస్తూ వారి కొత్త సినిమాలను రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. వీరికి పోటీగా విజయ్ మాస్టర్ సినిమా కూడా భారీగానే రిలీజ్ అవుతోంది. అయితే ఎవరికి వారు రిలీజ్ తేదీలను ఫిక్స్ చేసుకొని రెడీగా ఉండగా ఒక సినిమా రిలీజ్ డేట్ మారే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ సినిమా జనవరి 15న రానున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని బెల్లంకొండ హీరో కసి మీద ఉన్నాడు. అయితే సినిమాకు సంబంధించిన ఒక రూమర్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సినిమా ఒక రోజు ముందుగానే రిలీజ్ కాబోతోందట. అంటే జనవరి 14న రిలీజ్ చేయాలని సరికొత్త ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం.

అదే రోజున రామ్ పోతినేని రెడ్ సినిమా కూడా విడుదల కాబోతోంది. శుక్రవారం కావడంతో పండగతో పాటు వీకెండ్ ఉండడం బాక్సాఫీస్ కు కలిసొచ్చే అంశం. కానీ 50% ఆక్యుపెన్సీ తో కలెక్షన్స్ అనుకున్నంత రేంజ్ లో వచ్చే అవకాశం లేదు. వీలైనంత వరకు మొదటి వారంలోనే కలెక్షన్స్ భారీ స్థాయిలో అందుకోవాలని చూస్తున్నారు. అందుకే బెల్లంకొండ కూడా జనవరి 14న రావాలని ఓ ప్లాన్ వేసినట్లు టాక్.