»   » బెల్లంకొండ తనయుడితో సుకుమార్ సినిమా?

బెల్లంకొండ తనయుడితో సుకుమార్ సినిమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'అల్లుడు శీను' ట్రైలర్ విడుదలతో కొత్త హీరో సాయి శ్రీనివాస్ హాట్ టాపిక్‌గా మారాడు. ఈ ట్రైలర్లో సాయి శ్రీనివాస్ లుక్స్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా ఆకట్టుకునే విధంగా ఉండటంతో పలువురి దర్శకుల దృష్టి అతనిపై పడింది. తాజాగా ఫిల్మ్ నగర్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం దర్శకుడు సుకుమార్ సాయి శ్రీనివాస్‌తో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడట.

ఈ సంవత్సరం ఆరంభంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన '1-నేనొక్కడినే' చిత్రం భారీ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. దాని తర్వాత సుకుమార్ ఏ సినిమాకూ కమిట్ కాలేదు. ఇపుడు తన వద్ద ఉన్న కథ ఒకటి సాయి శ్రీనివాస్‌కు సరిపోయే విధంగా ఉండటంతో అతనితో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడట. అయితే ఈ విషయం అఫీషియల్‌గా ఖరారు కావాల్సి ఉంది.

Bellamkonda Srinivas in Sukumar’s direction

సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయం అవుతున్న 'అల్లుడు శీను' సినిమా విషయానికొస్తే....వివి వినాయక్ దర్శకత్వంలో వస్తున్న ఈచిత్రంలో సమంత హీరోయిన్. కొడుకు సినిమా కావడంతో బెల్లంకొండ భారీగా ఖర్చు పెడుతున్నారు. టాప్ హీరోయిన్ సమంతకు ఈ చిత్రం కోసం భారీగానే రెమ్యూనరేషన్ ముట్టజెప్పినట్లు సమాచారం. దీంతో పాటు మరో స్టార్ హీరోయిన్ తమన్నాతో ఐటం సాంగు చేస్తున్నారు.

ఏ విషయంలోనూ రాజీ పడకుండా సినిమాను లావిష్‌గా తెరకెక్కించారు. వివి వినాయక్ దర్శకత్వం, సమంత, తమన్నా, బ్రహ్మానందం లాంటి స్టార్స్‌ ఉండటం....యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రం ఉండబోతుండటంతో సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు యూనిట్ సభ్యులు.

English summary

 Alludu Seenu is yet to hit the screens, Bellamkonda Sreenivas has become the talk of the town. The film Bagar buzz is that Ace director Sukumar is all set to direct Sreenivas in his next. This will be Sukumar’s next film after Mahesh’s Neokkadine.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu