»   » వచ్చే ఏప్రియల్ లో నిర్మాతని పెళ్లి చేసుకుంటోన్న తెలుగు హీరోయిన్

వచ్చే ఏప్రియల్ లో నిర్మాతని పెళ్లి చేసుకుంటోన్న తెలుగు హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహాత్మ చిత్రంలో శ్రీకాంత్ సరసన నటించిన బావన గుర్తుందా. ఆమె గురించే ఇప్పుడు చెప్పబోయేది. తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ భావన. చాన్నాళ్లుగా ఆమె ఓ నిర్మాతతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఈ గాసిప్స్ ఈమె ఖండించనూ లేదు.. అలాగని నిజమేనని చెప్పలేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ..భావన త్వరలో పెళ్లికి సిద్దపడుతోంది. ఏప్రియల్ 2017లో ఈ వివాహం జరగవచ్చని మళయాళ మీడియా అంటోంది.

ఇక ఇప్పటివకూ భావన ఫలానా వారితో ప్రేమలో ఉన్నాను అని చెప్పలేదు. అలాగే పెళ్లి విషయమై ఎప్పుడూ క్లారిటీ ఇవ్వనూ లేదు. తన బోయ్ ఫ్రెండ్ ఫలానా అని మీడియాలో వస్తున్న వార్తను ఆమె ఖండించలేదు. కానీ ఆమె సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆమె వివాహానికి సిద్దపడుతోంది.

Bhavana To Tie The Knot In April 2017

ఇక వీరి వివాహం భారీ ఎత్తున ఏమీ జరగబోదని చెప్తున్నారు. సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు వినికిడి. ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులు మాత్రమే ఈ వివాహానికి హాజరవుతారు.

ఈ వివాహానికి రెండు వైపుల నుంచి కేవలం యాభై మంది మాత్రమే పెళ్లికు హాజరుకానున్నారు. త్వరలోనే వెడ్డింగ్ డేట్ ని ఫైనలైజ్ చేస్తారు. వివాహం అనంతరం కొద్ది కాలం పాటు భావన...సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటుంది.

ఇక మొదట ఈ జంట 2016 మధ్యలోనే వివాహం చేసుకుందామనుకున్నారు. అయితే ఆమె తండ్రి బాలచంద్రన్ హఠాత్తుగా మృతి చెందటంతో రెండు కుటుంబాల వాళ్లు పెళ్లిని వాయిదా వేసుకున్నారు.

ప్రస్తుతం భావన...జీన్ పాల్ మూవి ..హనీ బీ 2 చేస్తోంది. ఈ చిత్రం 2013 లో వచ్చిన హనీ బీ చిత్రం సూపర్ హిట్ కు సీక్వెల్ . అలాగే ఆమె మళయాళి హిట్ చిత్రం చార్లి కన్నడ రీమేక్ లో నటిస్తోంది.

English summary
Bhavana is finally all set to tie the knot with her long-time boyfriend. Some close friends of the actress recently confirmed that the couple is planning to enter the wedlock, in April 2017.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu