»   » స్టార్ కమిడియన్ నోటిదూల, మా సినిమాల్లో వద్దంటూ హీరోలు,డైరక్టర్స్ డైరక్ట్ గా నో

స్టార్ కమిడియన్ నోటిదూల, మా సినిమాల్లో వద్దంటూ హీరోలు,డైరక్టర్స్ డైరక్ట్ గా నో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నోటి దూల మహా ప్రమాదం ఎవరికైనా, ఎక్కడైనా. ముఖ్యంగా కొన్ని ప్రొఫిషనల్స్ లో అది మరీ ఇబ్బందులు తెచ్చి పెడుతుంది. ముఖ్యంగా గ్లామర్ తో ముడిపడి ఉన్న చోట మరీను. నోటి దూలతో గతంలో ఆఫర్స్ పోగొట్టుకున్నవాళ్లు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఓ స్టార్ కమిడయన్ అదే సమస్యను ఎదుర్కొంటున్నాడని తెలుగు సిని వర్గాల గుసగుసల్లో వినపడుతోంది.

అందుతున్న సమచారం ప్రకారం..ఆ స్టార్ కమిడియన్ మొన్న మొన్నటి వరకూ ఒక వెలుగు వెలిగిన వాడే. అయితే రీసెంట్ గా అతనికి ఆఫర్స్ తగ్గటం మొదలయ్యాయి. అతని కామెడీ మొనాటిని వచ్చిందని అంతా భావిస్తున్నారు. అందుకే హీరోలు ఆఫర్స్ ఇవ్వటం లేదంటున్నారు. కానీ నిజం అది కాదంటున్నారు.

Big heroes avoiding Star comedian

ఆ కమిడయన్ తన నోటి దూలతో కొందరు స్టార్ హీరోలపై చేసిన కామెంట్స్ , ఇప్పుడు అతని ఆఫర్స్ కు అడ్డం పడుతున్నాయట. అతను ప్రెవేట్ టాక్స్ లో నోటి దూలతో తాగి చేసే కామెంట్స్ అతనికి శాపం అయ్యాయి అని చెప్పుకుంటున్నారు.

తన స్టార్ నడిచినంతకాలం అతను వెనక ఎన్ని కామెంట్స్ చేసినా, ఎదురుగా పొగడుతున్నాడు , అతనితో మనకి పని ఉంది అని పెద్దగా పట్టించుకునేవారు కాదు హీరోలు. కానీ అతని టైమ్ అయ్యిపోగానే..కాస్త వెనకపడగానే అతని తప్పులన్ని వారికి కనపడటం మొదలయ్యాయి.

దానికి తోడు అతను స్టార్ కమిడయన్ గా వెలుగుతూండగా డైరక్షన్ డిపార్టమెంట్ లో ఉన్న అసెస్టెంట్ లను, అశోసియేట్ లను చాలా చాలా చిన్న చూపు చూసేవాడు. ఇప్పుడు వాళ్లలో చాలా మంది డైరక్టర్స్ అయ్యారు. కొందరు రైటర్స్ అయ్యారు. వాళ్లు పొరపాటున కూడా ఆ స్టార్ కమిడయన్ కు క్యారక్టర్స్ రాయటం లేదు. నిర్మాతలు ఆ కమిడయన్ ప్రిఫర్ చేసినా, ఫ్లాఫ్ సెంటిమెంట్ చూపెట్టి ప్రక్కన పెట్టేస్తున్నారట. అదీ సంగతి.

English summary
Star heroes avoiding Big comedian because he always criticizes all heroes in private talks.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu