»   » చైతు ముందు బిగ్ టాస్క్..అందుకోగలడా?

చైతు ముందు బిగ్ టాస్క్..అందుకోగలడా?

Subscribe to Filmibeat Telugu

అక్కినేని హీరో నాగచైతన్య వరుస చిత్రాలతో ప్రస్తుతం బిజీగా గడుపుతున్నాడు. నాగచైతన్య సవ్యసాచి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తరువాత నాగచైతన్య తన సతీమణి సమంతతో కలసి ఓ చిత్రంలో నటించాల్సి ఉంది. కాగా సవ్యసాచి చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంతో నాగచైతన్య పెద్ద టార్గెట్ నే సెట్ చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. నాగ చైతన్య కెరీర్ లో రారండోయ్ వేడుక చూద్దాం చిత్రం పెద్ద హిట్. ఈ చిత్రం 25 కోట్ల వరకు వసూలు చేసింది.

కాగా సవ్యసాచి చిత్ర బడ్జెట్ ఇప్పటికే పాతిక కోట్లు దాటిపోయినట్లు తెలుస్తోంది. అంటే సవ్యసాచి చిత్రం హిట్ కావాలంటే నాగ చైతన్య పెద్ద టార్గెట్ నే చేరుకోవాల్సి ఉంటుంది. కథపై ఉన్న నమ్మకంతో నిర్మాతలు ఖర్చు చేయడానికి వెనుకాడడం లేదని వార్తలు వస్తున్నాయి. సవ్యసాచి చిత్రంతో హిట్ కొట్టి తొలిసారి 30 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అవ్వాలని నాగచైతన్య భావిస్తున్నాడు.

Big target in front of Naga Chaitanya
English summary
Big target in front of Naga Chaitanya. Naga Chaitanya wants to reach that mark with Savyasachi movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X