Just In
- 4 min ago
మరో సర్ప్రైజ్ ప్లాన్ చేసిన రవితేజ: ఆరోజే అలరించబోతున్న మాస్ మహారాజా
- 17 min ago
స్టార్ డైరెక్టర్ శిష్యుడితో నాగశౌర్య మరో డిఫరెంట్ మూవీ.. టైటిల్ కొత్తగా ఉందే!
- 23 min ago
చిరంజీవి కోసం బాలీవుడ్ ప్రముఖుడు: తెలుగులో ఇది మూడో సినిమా మాత్రమే!
- 39 min ago
‘క్రాక్’ తర్వాత నందమూరి బాలకృష్ణతో సినిమా: క్లారిటీ ఇచ్చిన గోపీచంద్ మలినేని
Don't Miss!
- News
కాబోయే సీఎం కేటీఆర్‌కు శుభాకాంక్షలు... తేల్చేసిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్...
- Sports
ఇంటికి రాగానే దెబ్బ తగిలిన ప్రతి చోట ముద్దులు పెట్టింది: పుజారా
- Lifestyle
డయాబెటిస్ ఉన్నప్పటికీ సుదీర్ఘకాలం మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఇక్కడ కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఉన్నాయ
- Finance
ఫ్యూచర్ గ్రూప్ డీల్, అమెజాన్‌కు షాక్: రిలయన్స్‌కు గుడ్‌న్యూస్, షేర్ జంప్
- Automobiles
భారత్‌లో అడుగుపెట్టిన కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్; ధర & వివరాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సంక్రాంతి పోటీలో బిగ్ ట్విస్ట్: అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ చేంజ్.. ఏకంగా రెండు రోజులు.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని పండుగ సీజన్లకు ప్రత్యేకమైన పోటీ ఉంటుంది. వాటిలో ముఖ్యంగా తెలుగు వారి పండుగ సంక్రాంతి గురించి వేరేగా చెప్పక్కర్లేదు. దీనికి కారణం ఆ సమయంలో పల్లెలతో పాటు పట్టణాలన్నీ కళకళలాడుతూ ఉంటాయి. అన్నింటికీ మించి వారం రోజుల పాటు సెలవులు ఉంటాయి. దీంతో తమ సినిమాలను విడుదల చేయాలని ప్రతి ఫిల్మ్ మేకర్ అనుకుంటాడు. గత సీజన్లలానే ఇప్పుడు కూడా భారీ చిత్రాలు విడుదల అవుతున్నాయి. అందులో మహేశ్ 'సరిలేరు నీకెవ్వరు', బన్నీ 'అల.. వైకుంఠపురములో' మధ్య పోటీ ఉంటుందని అనుకుంటున్నారు. ఈ సమయంలో సంక్రాంతి పోటీలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ మారింది. వివరాల్లోకి వెళితే...

అందరూ స్టార్లే అందుకే అంచనాలు
టాలీవుడ్‌లోని ఇద్దరు స్టార్ హీరోలు మహేశ్ బాబు, అల్లు అర్జున్ సంక్రాంతి బరిలో నిలిచారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు'తో మహేశ్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న ‘అల.. వైకుంఠపురములో' ద్వారా బన్నీ సంక్రాంతి బరిలో నిలుస్తున్నారు. క్రేజీ కాంబినేషన్లు కావడంతో ఈ రెండు సినిమాలపై భారీగా అంచనాలు ఉన్నాయి.

మహేశ్ సరికొత్తవి ట్రై చేస్తున్నాడు
‘భరత్ అనే నేను', ‘మహర్షి' వంటి హిట్ల తర్వాత మహేశ్ ‘సరిలేరు నీకెవ్వరు'తో వస్తున్నాడు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో విజయశాంతి, బండ్ల గణేష్, ప్రకాశ్ రాజ్, సంగీత కీలక పాత్రలు చేశారు. ఇది కూడా హిట్ కొట్టి హ్యాట్రిక్ చేయాలన్న కసితో ఉన్న సూపర్ స్టార్.. అందుకోసం ఎన్నో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నాడు.

అల్లు అర్జున్ నమ్మకం మాత్రం ఇదే
‘నా పేరు సూర్య' పరాజయం తర్వాత అల్లు అర్జున్ హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు. ఈ క్రమంలోనే ‘అల.. వైకుంఠపురములో' చేశాడు. పూజా హెగ్డే కథానాయికగా చేస్తున్న ఈ సినిమాలో చాలా మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారు. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడంతో ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని బన్నీ నమ్మకంతో ఉన్నాడట.

అందులో మాత్రం ఒక దానిని మించి మరొకటి
విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో రెండు సినిమాలు యూనిట్లు ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేశాయి. ఇందులో భాగంగానే కొద్ది రోజుల నుంచి టీజర్లు, పాటలు విడుదల చేస్తున్నాయి. ఈ రెండు మూవీల నుంచి వస్తున్న ప్రతి దానికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఒక దానిని మించి మరొకటి రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.

అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ చేంజ్
పది రోజుల్లో ఈ సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో ఓ షాకింగ్ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం.. అల్లు అర్జున్ నటిస్తున్న ‘అల.. వైకుంఠపురములో' రిలీజ్ డేట్ మారిందట. వాస్తవానికి ఈ సినిమాను జనవరి 12న విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే, తాజాగా దానికి జనవరి 10 మార్చుతున్నారని ప్రచారం జరుగుతోంది.

‘అల' టీమ్ నిర్ణయానికి కారణం ఇదేనట
సినిమా రిలీజ్ డేట్‌ను రెండు రోజులు ముందుకు జరపడానికి కారణం.. ఓపెనింగ్స్ అనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఒకరోజు ముందు వస్తున్న ‘సరిలేరు'కు ఆ విషయంలో అడ్వాంటేజ్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. దీంతో ‘అల' టీమ్ ముందుకు వచ్చిందని తెలుస్తోంది. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ, ఈ న్యూస్ మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.