Don't Miss!
- Technology
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- Finance
ghmc tax fraud: అలా పన్ను చెల్లించిన వారిపై GHMC ఆగ్రహం.. FIR నమోదుకు రంగం సిద్ధం
- News
అనుచరులతో ఆనం మరో భేటీ- రెండునెలల్లో రెడీగా ఉండాలని సూచన-కోర్టు కెళ్దామంటూ..
- Sports
INDvsNZ : ఫ్యూచర్ ఇదే.. గిల్ను స్టార్ అంటూ మెచ్చుకున్న విరాట్ కోహ్లీ!
- Lifestyle
Yoga For Eyes: కంటి యోగా.. చూపు మెరుగవుతుంది, ఇంకా ఎన్నో లాభాలు
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Pushpa 2 vs RC 15: బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్దమవుతున్న అల్లు అర్జున్, రామ్ చరణ్.. బిగ్గెస్ట్ క్లాష్!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో పెద్ద సినిమాల మధ్య పోటీ ఉండడం అనేది సర్వసాధారణం విషయం అని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఒకే ఫ్యామిలీ నుంచి వస్తున్న స్టార్ హీరోల సంఖ్య కూడా ఎక్కువగానే పెరుగుతుంది. ఇక వారు బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే మాత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది అనే చెప్పాలి. ఇక రాబోయే రోజుల్లో మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ మధ్యలో కూడా క్లాష్ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక వీరి రెండు సినిమాలు ఎప్పుడు విడుదల కాబోతున్నాయి అనే వివరాల్లోకి వెళితే..

మెగాస్టార్ తో బాలయ్య ఫైట్
ఈ సంక్రాంతికి వచ్చిన నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు కూడా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుమతున్నారు. అయితే ఈ క్లాష్ లో మాత్రం మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద పైచేయి సాధించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసి ప్రాఫిట్ అందిస్తోంది. ఇక వీర సింహారెడ్డి మాత్రం ఇంకాస్త కలెక్షన్స్ అందుకుంటే టార్గెట్ పూర్తి చేసినట్లు లెక్క.

పుష్ప 2.. గ్రాండ్ ప్లానింగ్
అయితే రాబోయే రోజుల్లో మరికొన్ని పెద్ద సినిమాల మధ్య కూడా పోటీ ఉండబోతున్నట్లుగా అనిపిస్తుంది. ప్రస్తుతం అందరి ఫోకస్ ఎక్కువగా స్టార్ హీరోల పాన్ ఇండియా సినిమాలో పైనే ఉన్నాయి. ఇక అందులో అల్లు అర్జున్ పుష్ప సెకండ్ పార్ట్ కూడా ఉంది. ఈ ప్రాజెక్టు భారీ స్థాయిలో తెరపైకి తీసుకురాబోతొంది. ఫస్ట్ పార్ట్ మంచి విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు సుకుమార్ సెకండ్ పార్ట్ కోసం కూడా అంతకుమించి అనేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇక RC 15 సినిమాతో రామ్ చరణ్ సినిమాకు పోటీగా రావచ్చు అని తెలుస్తోంది.

ఆలస్యంగా RC 15
రామ్ చరణ్ తేజ్ శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ సినిమా ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోలేదు. ఎందుకంటే దర్శకుడు శంకర్ ఊహించని విధంగా మరోవైపు కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాను లైన్లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. హఠాత్తుగా ప్రాజెక్టు మధ్యలోకి రావడంతో ఇప్పుడు రామ్ చరణ్ సినిమా కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

2024 బాక్సాఫీస్ ఫైట్
ఇంతకీ అల్లు అర్జున్ రామ్ చరణ్ మధ్యలో ఎప్పుడు పోటీ అనే వివరాల్లోకి వెళ్తే పుష్ప 2, RC 15 రెండు సినిమాలు కూడా 2024 సంక్రాంతికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ రెండు సినిమాలపై అంచనాలు అయితే మామూలుగా లేవు. వేటికవే భిన్నంగా తెరపైకి రాబోతున్నాయి. అంతేకాకుండా హై వోల్టేజ్ యాక్షన్స్ సీన్స్ కూడా ఉంటాయి కాబట్టి మంచి టాక్ వస్తే మాత్రం రెండు సినిమాలు సక్సెస్ అవుతాయి. కానీ ఏదో ఒక విధంగా మాత్రం ఒక సినిమాపై అయితే ప్రభావం పడుతుంది.

మైత్రి మూవీ మేకర్స్ సొంతంగా..
ఇక 2024 సంక్రాంతికి రాబోయే ఈ రెండు సినిమాల విషయంలో నిర్మాతలు ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక పుష్ప సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంస్థ నైజాం లో ఈ సినిమాను సొంతంగా విడుదల చేసుకునే అవకాశం ఉంది. ఇక హిందీలో కూడా మైత్రి మూవీ మేకర్స్ సొంతంగా విడుదల చేసుకోవాలని కూడా అనుకుంటుంది. ఇక దిల్ రాజు ఈ సంక్రాంతికి మైత్రి సినిమాల ప్రభావం వలన వారసుడు సినిమాకు తక్కువ కలెక్షన్స్ అందుకోవాల్సి వచ్చింది. మరి తదుపరి సంక్రాంతికి అయినా దిల్ రాజు తన RC 15 సినిమాతో మైత్రి వారికి పోటీని ఇస్తాడో చూడాలి.