For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  PK - Chiru మల్టీస్టారర్.. త్రివిక్రమ్ వల్లే కాలేదు.. మరి ఆ మాస్ డైరెక్టర్ సెట్ చేయగలడా?

  |

  ఒకప్పుడు మల్టీస్టారర్ సినిమాలు అంటే దర్శకులు చాలా భయపడేవారు. ఒకేసారి ఇద్దరు హీరోలను బ్యాలెన్స్ చేయడం అంటే అంత సామాన్యమైన విషయం కాదని అందుకే వీలైనంత వరకు మల్టీస్టారర్ కథలను పెద్దగా టచ్ చేసే వాళ్ళు కాదు. నిజానికి ఒకప్పుడు హీరోలు కూడా అలాంటి సినిమాలు చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపేవారు కాదు. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో మాత్రమే కొంతమంది హీరోలు కథను బట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వారు. కానీ గత పదేళ్ల ముందు వరకు కూడా అగ్ర హీరోలు మల్టీస్టారర్ అంటేనే వెనకడుగు వేసేవారు.

  అంత ఈజీగా ఎవరు కథలు వినడానికి ఒప్పుకునే వారు. నిర్మాతలు కూడా ఆ టెన్షన్ ఎందుకని ఒప్పుకునేవారు కాదు. ఇక ఇప్పుడు అయితే ఓ వర్గం హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. త్వరలోనే మెగా కాంపౌండ్ లో మరో బిగ్గెస్ట్ మల్టిస్టారర్ తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఒక దర్శకుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో పవన్ కళ్యాణ్ కోసం ఒక ప్రత్యేకమైన పాత్రను క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది.

  మెగా మల్టీస్టారర్

  మెగా మల్టీస్టారర్

  మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యువ హీరోలకు ఏ మాత్రం తక్కువ కాకుండా వరుసగా బిగ్ బడ్జెట్ సినిమాలను లైన్ లో పెడుతున్న విషయం తెలిసిందే. మంచి సందేశంతో పాటు వీలైనంతవరకు కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మిక్స్ చేసి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

  కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో రామ్ చరణ్ మరొక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది కూడా ఒక విధంగా మల్టీస్టారర్ సినిమా అని చెప్పవచ్చు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్ 40 నిమిషాలకు పైగా సినిమాల్లో కనిపిస్తాడని తెలుస్తోంది. దాదాపు చరణ్ పాత్ర కూడా పవర్ఫుల్ గా ఉంటుందని సమాచారం.

  వాతావరణం ఎలా ఉంటుందో..

  వాతావరణం ఎలా ఉంటుందో..

  మెగా కాంపౌండ్ లో మల్టీ స్టారర్ సినిమాలు చేస్తే బాక్సాఫీసు వద్ద వాతావరణం ఎలా ఉంటుందో ఊహకు కూడా అందడం లేదు అని అభిమానులు ఎక్కువగా కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ అలాంటి సినిమాలు వస్తే తప్పకుండా అభిమానులకు పండగ అని చెప్పవచ్చు. ఇష్టమైన హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఆ కిక్కు మామూలుగా అయితే ఉండదు. ఇక అగ్రహీరోలు కలిసి నటిస్తే థియేటర్స్ విజిల్స్ మోతతో మోగిపోవాల్సిందే. ఇక మెగా స్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తే ఆ వాతావరణం కూడా మామూలుగా ఉండదు అని చెప్పవచ్చు.

  త్రివిక్రమ్ వల్లే కాలేదు..

  త్రివిక్రమ్ వల్లే కాలేదు..

  మెగా కాంబినేషన్లో మల్టీస్టారర్ సినిమాలు చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తున్నట్లు అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. నిజానికి రాజకీయ ప్రముఖుడు, సినీ నిర్మాత సుబ్బిరామిరెడ్డి కూడా వీరిద్దరితో కలిపి ఒక సినిమా చేయాలని అనుకున్నారు. కానీ ఆ ప్లాన్స్ ఎందుకో అయితే వర్కవుట్ కాలేదు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఇద్దరు బడా హీరోలకు సమానంగా సరిపోయే కథలు సెట్ చేయలేకపోయాడు.

  బాబీ న్యూ ప్లాన్..

  బాబీ న్యూ ప్లాన్..

  అయితే ఇప్పుడు మరొక యువ దర్శకుడు బిగ్ స్టార్స్ ను ఓకే ప్రేమలో చూపించడానికి ధైర్యం చేయబోతున్నట్లు ఒక టాక్ అయితే వస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు జై లవకుశ వెంకీమామ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న బాబి. మెగాస్టార్ చిరంజీవితో ఒక ఫుల్ మాస్ కమర్షియల్ సినిమా చేయబోతున్న బాబి ఫుల్ స్క్రిప్ట్ ఇటీవల సిద్ధం చేశాడు. ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర కోసం పవన్ కళ్యాణ్ ని ఫిక్స్ చేసుకున్నట్లు టాక్ అయితే వస్తుంది.

  పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే..

  పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే..

  మొదట మెగాస్టార్ చిరంజీవికి కూడా అలాంటి ఆలోచన రాలేదట కానీ దర్శకుడు బాబి మాత్రం పవన్ కళ్యాణ్ తో స్పెషల్ పాత్రను చేయిస్తే సినిమాకు చాలా బాగా ప్లస్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నాడట. ఈ దర్శకుడు ఇదివరకే పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. కానీ ఆ సినిమా అంతగా హిట్టవ్వలేదు. ఇక పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవడం వంటి ఆఫర్ వస్తే ఎంతవరకు ఓకే చెబుతాడు అనేది మరొక సందేహం.

  Bigg Boss Telugu 4 : Megastar Chiranjeevi Promise To Sohel | Chiru Bumper Offer To Divi
  దర్శకుడి టార్గెట్ అయితే అదే..

  దర్శకుడి టార్గెట్ అయితే అదే..

  ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. గతంలో శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో ఒక అతిధి పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న ఆ టాక్ ఎంత వరకు నిజమో తెలియదు కానీ దర్శకుడు బాబీ మాత్రం మెగాస్టార్ తో చేయబోయే సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం ఎవరైనా ప్రముఖ హీరోను సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాడట.

  మరి అతడి సెలెక్షన్ ఏవిధంగా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అలాగే హరిహర వీరమల్లు సినిమాతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయనున్న సినిమాలు వచ్చే ఏడాది విడుదల చేయనున్నాడు.

  English summary
  Bobby Approached Pawan Kalyan For Another Role for chiru 155
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X