»   » షాకింగ్.... ‘సర్దార్ గబ్బర్ సింగ్’ దర్శకున్ని తప్పించారా?

షాకింగ్.... ‘సర్దార్ గబ్బర్ సింగ్’ దర్శకున్ని తప్పించారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ‘స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్' మొదలు కావడానికే చాలా ఏళ్ల సమయం పట్టింది. ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యాక ఎంత ఆలస్యం అయిందో ఎంత మంది దర్శకులు మారారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. చివరకు డైరెక్టర్ బాబీ ఫైనల్ అయ్యాడు. షూటింగ్ కూడా మొదలైంది. ఈ చిత్రాన్ని శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమా నుండి డైరెక్ట‌ర్ బాబీని తప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. బాబీతో డిఫ‌రెన్స్ రావ‌డం వ‌ల‌న ఈ సినిమా నుంచి కెమెరామెన్ జ‌య‌న‌న్ విన్సెంట్ త‌ప్పుకున్నారు. ఆయ‌న‌తో పాటు టెక్నిక‌ల్ టీమ్ లో మ‌రొక‌రు ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్నార‌ట‌. దీంతో ఈ సినిమా నుంచి డైరెక్ట‌ర్ బాబీని త‌ప్పించార‌ని, త్వ‌ర‌లోనే డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నేది ఎనౌన్స్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో సినిమా షూటింగ్ ఆగిపోయినట్టు తెలుస్తోంది.

Bobby out of 'Sardar Gabbar Singh'

ఒక వేళ డైరెక్టర్ బాబీని తప్పించిన విషయం నిజమే అయితే....దర్శకుడుగా ఎవరు రాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. కొత్త దర్శకుడు ఎవరైనా వస్తారా? లేక పవన్ కళ్యాణే డీల్ చేస్తారా? అనే చర్చ సాగుతోంది.

మరో వైపు ఈ సినిమాలో లక్ష్మీరాయ్ తో ఓ ఐటం సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రిహార్సల్స్ లో పవన్ పాల్గొంటున్నట్లు సమాచారం. దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన ఓ పాట అదిరిపోనుందని, ఆ పాట పెద్ద హిట్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. రామానాయుడు స్టూడియోస్ నానక్ రామగూడ లో ఈ సాంగ్ షూట్ జరగనుంది. ఈ పాట కోసం ఆర్ట్ డైరక్టర్ బ్రహ్మకడలి సెట్స్ వేస్తున్నారు.

నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. కళ: బ్రహ్మ కడలి, కూర్పు: గౌతంరాజు, పోరాటాలు: రామ్‌ లక్ష్మణ్‌.

English summary
Film Nagar source said that, Director Bobby out of Pawan Kalyan's 'Sardar Gabbar Singh' project.
Please Wait while comments are loading...