»   » అక్షయ్ కుమార్‌కు అంత సీన్ ఉందా.. రజనీకాంత్‌ను మించిన రుస్తుం!

అక్షయ్ కుమార్‌కు అంత సీన్ ఉందా.. రజనీకాంత్‌ను మించిన రుస్తుం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

విభిన్నమైన చిత్రాలతో, వరుస హిట్లతో దూసుకెళ్తున్న బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న రోబో 2.0 చిత్రంలో నటిస్తున్నాడు. దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం దీపావళీ కానుకగా విడుదలయ్యేందుకు ముస్తాబవుతున్నది. ఈ చిత్రంలో నటించినందుకు గాను అక్షయ్ కుమార్ తీసుకొంటున్న రెమ్యూనరేషన్ ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో టాక్‌గా నిలిచింది.

రుస్తుం రెమ్యూనరేషన్‌పై చర్చ

రుస్తుం రెమ్యూనరేషన్‌పై చర్చ

రోబో 2.0 చిత్రానికి సంబంధించిన వార్త రోజుకో సంచలనం సృష్టిస్తున్నది. ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించనున్న అక్షయ్ కుమార్ తీసుకొనే రెమ్యూనరేషన్‌పై చర్చ జరుగుతున్నది. ఈ సినిమా కోసం సూపర్ స్టార్ రజనీకాంత్ కంటే ఎక్కువగానే పారితోషికం ఇస్తున్నారనే సంచలన వార్తగా మారింది.

రోజుకు రూ.2 కోట్లు..

రోజుకు రూ.2 కోట్లు..

ఈ సినిమాలో నటిస్తున్నందుకు గాను రోజుకు రూ.2 కోట్లు ఇస్తున్నట్టు సమాచారం. ఇది రూమరో, నిజమో తెలియదు కానీ రోబో 2.0 కోసం పడుతున్న కష్టానికి మాత్రం ఎంత ఇచ్చిన నష్టమేమీ లేదనే మాట వినిపిస్తున్నది. ఈ సినిమాలో రజనీ 5 గెటప్‌లలో కనిపిస్తుండగా, అక్షయ్ కుమార్ దాదాపు 12 రకాల పాత్రల్లో నటిస్తున్నట్టు తెలిసింది.

రోజులో పలుమార్లు మేకప్..

రోజులో పలుమార్లు మేకప్..

రోబో 2.0 చిత్రంలో అక్షయ్‌ ప్రత్యేకమైన గెటప్‌లో కనిపిస్తారట. ఈ పాత్ర కోసం ప్రతీరోజు ఎక్కువ సార్లు మేకప్ వేసుకోవాల్సి వచ్చేదట. తన 25 ఏళ్ళ సినీ కెరీర్‌లో ఎక్కవసార్లు మేకప్ వేసుకోవడం ఇదే తొలిసారి అట. ఇప్పటికే విడుదలైన అక్షయ్ గెటప్ విశేషంగా ఆకర్షిస్తున్నది.

కాకి ప్రేమికుడు అట..

కాకి ప్రేమికుడు అట..

గతంలో కూడా బాలీవుడ్‌లో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలు అక్షయ్ కుమార్ పోషించారు. అయితే పూర్తి స్థాయి విలనిజం ఉండే పాత్రను చేయడం కెరీర్‌లో ఇదే మొట్టమొదటిసారి. ఈ పాత్రకు పలు కోణాలు ఉన్నాయట. ఈ చిత్రంలో అక్షయ్ పక్షి ప్రేమికుడు అనే మాట వినిపిస్తున్నది. మనుషుల పట్ల క్రూరత్వంగా ఉండే అక్షయ్ పక్షులపై అత్యంత ప్రేమను కలిగి ఉండటం ఈ పాత్ర నైజం. విలన్‌ పాత్రలో కనిపిస్తున్న అక్షయ్‌కు కాకి అంటే ఇష్టమట. కాకి రూపంలో ఉండే విలన్‌గా ఓ ప్రత్యేకమైన గెటప్‌ను వేస్తున్నట్టు తెలుస్తున్నది.

రూ.400 కోట్లతో రోబో 2.0

రూ.400 కోట్లతో రోబో 2.0

దక్షిణాదిలో అత్యంత భారీగా రూ. 400 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రం విడుదలకు ముందే పలు సంచలనాలకు వేదికైంది. సంచలన దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ 2.0. రజినీకాంత్, అమీ జాక్సన్ ప్రధాన పాత్రలను పోషిస్తున్న సంగతి తెలిసిందే.

పరిణతి పొందిన పాత్రల్లో రౌడీ రాథోడ్..

పరిణతి పొందిన పాత్రల్లో రౌడీ రాథోడ్..

బాలీవుడ్‌లో ఇటీవల కాలంలో అక్షయ్ కుమార్ పరిణతి పొందిన పాత్రల్లో కనిపిస్తున్నారు. స్పెషల్ 26, ఓ మై గాడ్,రౌడీ రాథోడ్, హాలీడే, బేబీ, ఎయిర్‌లిఫ్ట్, గబ్బర్ ఈస్ బ్యాక్, రుస్తుం, జాలీ ఎల్‌ఎల్బీ 2 చిత్రాల్లో అక్షయ్ ధరించిన విలక్షణ పాత్రలపై విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. రుస్తుం చిత్రంలో ఆయన నటనకు గానూ కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జాతీయ ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపిక చేసింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న రోబో 2.0, టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్‌మ్యాన్ చిత్రాల్లో షూటింగ్ దశలో ఉన్నాయి.

English summary
Bollywood Superstar Akshay kumar's remuneration for Robo 2.0 is now talk of the industry now. He is being paid more than superstar Rajinikanth. Reports suggests that Akshay Kumar taking dialy wise remuneration for Shankar's movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu