»   » కొత్త ట్విస్ట్... రేసు లోకి బాలయ్య గాడ్ ఫాధర్?

కొత్త ట్విస్ట్... రేసు లోకి బాలయ్య గాడ్ ఫాధర్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలకృష్ణ వందో చిత్రం ఏమి చేయబోతున్నారనేది రోజు రోజుకీ ఆసక్తికరంగా మారిపోయింది. రోజుకో డైరక్టర్, టైటిల్ ప్రచారంలోకి వస్తోంది. రెండు రోజుల క్రితం వరకూ సింగీతం శ్రీనివాసరావు, అనీల్ రావిపూడి కథలు ఓకే చేసారని, వీరిలో ఒకరితో చిత్రం ఉంటుంది అన్నారు. ఇప్పుడు సీన్ మారింది.

బాలయ్యతో లెజండ్, సింహా అంటూ సూపర్ హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీనివాస్ ...సీన్ లోకి వచ్చారు. ఆయన ఇప్పుడు ‘గాడ్ ఫాధర్'అనే కథను బాలయ్య కోసం రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Boyapati Srinu's Godfather is Balayya

‘ఆదిత్యా 999' కథలో సోషియో ఫాంటసీతో సాగితే, అనిల్ రావిపూడి తో అనుకున్న ‘రామారావుగారు'ఫన్ తో కూడిన యాక్షన్ తో సాగుతుంది. అదే బోయపాటి కథ అయితే పూర్తిగా ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ సీన్స్ తో ఉంటుంది. అందుకే బాలకృష్ణ అటువైపు మ్రొగ్గు చూపుతున్నట్లు చెప్పుకుంటున్నారు.

బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్ అంటే నందమూరి అభిమానులకు పండుగే. దాంతో ఫ్యాన్స్ కూడా తన నుంచి ఇలాంటి సినిమానే ఎక్సపెక్ట్ చేస్తారని భావిస్తున్న బాలయ్య కొద్ది రోజులు లేటైనా బోయపాటితోనే వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు.

బోయపాటి శ్రీను కూడా ఈ వందో చిత్రం ప్రతిష్టాత్మంగా భావించి రూపొందించటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కథపై ప్రస్తుతం కసరత్తుల చేస్తున్న బోయపాటి త్వరలోనే బాలయ్యకు నేరేట్ చేసి, ఓకే చేయించుకుంటారంటున్నారు. వెయిట్ అండ్ సీ.

English summary
Balakrishna will be working with Boyapati Srinu for ‘God Father’ project.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu