»   »  బ్రహ్మానందం బుల్లెట్ ఈ సారైనా దిగుతుందా?

బ్రహ్మానందం బుల్లెట్ ఈ సారైనా దిగుతుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : "ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా...బుల్లెట్ దిగిందా లేదా" అంటాడు మహేష్ బాబు పోకిరి గెటప్ లో. ఇప్పుడు అదే డైలాగు బ్రహ్మానందం కెరిర్ లో కి ఎదురుకానుంది. బ్రహ్మానందం మరోసారి హీరోగా కనిపించనున్నాడు. ఎందుకైనా మంచిదని ఈ సారి పవన్ క్రేజ్ ని తోడు తెచ్చుకుంటున్నాడు. అయితే పవన్ ని వాడుకునేది కేవలం టైటిల్ వరకేనట. 'మూడడుగుల బుల్లెట్‌' టైటిల్ తో ఓ చిత్రం చేస్తున్నారు. అయితే ఇంతకు ముందు జఫ్ఫా టైటిల్ తో ఓ చిత్రం బ్రహ్మానందం హీరోగా వచ్చి డిజాస్టర్ అయ్యింది. ఇప్పటివరకూ బ్రహ్మానందం హీరోగా వచ్చిన ఏ చిత్రం సక్సెస్ కాలేదు. దాంతో ఈ బుల్లెట్ అయినా దిగుతుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.

'అత్తారింటికి దారేది' సినిమాలో సూపర్ హిట్ సాంగ్... ''వీడు ఆరడుగుల బుల్లెట్టూ.. ధైర్యం విసిరిన రాకెట్టూ..'' . అయితే ఇప్పుడు ఆ బుల్లెట్‌ని కాస్త కుదించి.... ఆరడుగులు నుంచి మూడడుగులకి తీసుకు వచ్చారు. ఎందుకంటే సీనులో ఉన్నది పవన్‌ కల్యాణ్‌ కాదు, బ్రహ్మానందం. ఆయన కథానాయకుడిగా ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. దీనికి 'మూడడుగుల బుల్లెట్‌' అనే పేరు పెట్టారని సమాచారమ్‌. సెలెంట్ గా చిత్రీకరణ కూడా జరిగిపోతోంది.

Brahmanandam as Mudadugula Bullet

ఈ సినిమాతో ఓ రచయిత దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఆయన ఎవరనేది త్వరలో తెలుస్తుంది. బ్రహ్మానందం సరసన ఓ కథానాయిక కూడా ఉంది. మాఫియా నేపథ్యంలో సాగే ఈ కథ ఆద్యంతం వినోదాత్మకంగా నడుస్తుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలి. ఈ సారన్నా హీరోగా బ్రహ్మానందం హిట్ కొడతానని పూర్తి నమ్మకంగా ఉన్నారు. లో బడ్జెట్ లో నిర్మాణమయ్యే ఈ చిత్రం ప్రమోషన్ సైతం విభిన్నంగా ప్లాన్ చేసారని తెలుస్తోంది.

ఇప్పటికే 950కిపైగా చిత్రాల్లో నటించిన ఆయన త్వరలో 1000 చిత్రాల మార్కును దాటబోతున్నారు. ప్రతి సినిమాలోనూ ప్రేక్షకులను నవ్విస్తూ...హాస్యానికి కొత్త ఒరవడితో కేవలం హావభావాతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టడం బ్రహ్మానందం ప్రత్యేకత. అత్యధిక చిత్రాలలో నటించిన నటుడిగా గిన్నిస్‌బుక్‌ రికార్డును సైతం అందుకున్న బ్రహ్మి కేంద్ర ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డును సైతం అందుకున్నారు అందుకున్నారు. ఇప్పటికీ ఈయన తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత ఎక్కువ సినిమాలలో నటిస్తూ, ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హాస్య చక్రవర్తి.

English summary

 Brahmanandam has begun a new film as a hero. The movie is also funnily titled Mudadugula Bullet. The film is being directed by a new director. Currently shooting is progressing in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu