twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    320 కోట్లు? బ్రహ్మానందం ఆస్తులపై ఇండస్ట్రీలో హాట్ టాపిక్!

    బ్రహ్మానందం ఆస్తుల విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఈ స్టార్ కమెడియన్ రూ. 320 కోట్ల విలువ చేసే ఆస్తులు కలిగి ఉన్నాడట.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగు కమెడియన్ బ్రహ్మానందం పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్‌ను ఏలిన ప్రముఖ కమెడియన్లలో బ్రహ్మానందం ఒకరు. ఒకానొక సందర్భంలో బ్రహ్మానందం లేకుండా తాము సినిమాలు చేయమని స్టార్ హీరోలు నిర్ణయించుకున్న పరిస్థితి.

    చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బ్రహ్మానందం తెలుగులో అత్యధిక సినిమాలు చేసిన కమెడియన్ స్థాయికి ఎదిగారు. ఓ సందర్భంలో ఏ కమెడియన్, ఏ యాక్టరూ లేనంత బిజీ బిజీగా బ్రహ్మానందం తన హవా కొనసాగించారు.

    బ్రహ్మీ ఆస్తులు హాట్ టాపిక్

    బ్రహ్మీ ఆస్తులు హాట్ టాపిక్

    డిమాండ్ ఎక్కువ కాబట్టి ఆయన సంపాదన కూడా అదే స్థాయిలో పెరుగుతూ పోయిందని, ఆయన ఆస్తుల వివలు భారీగానే ఉందని తాజాగా ఆంగ్లపత్రికలో ఆర్టికల్ రావడంతో ఇండస్ట్రీలో ఈ విషయం టాక్ మొదలైంది.

    రూ. 320 కోట్ల ఆస్తులు?

    రూ. 320 కోట్ల ఆస్తులు?

    టాలీవుడ్లో హయ్యెస్ట్ పేయిడ్ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న బ్రహ్మానందం..... ఆస్తుల విలువ రూ. 320 కోట్ల వరకు ఉంటుందని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.

    ఖరీదైన కార్లు

    ఖరీదైన కార్లు

    బ్రహ్మానందం వద్ద ఖరీదైన ఆడి ఆర్ 8, ఆడి క్యూ 7, మెర్సిడెజ్ బెంజ్ లాంటి ఖరీదైన కార్లు ఉన్నాయట.

    భారీగా స్థిరాస్తులు

    భారీగా స్థిరాస్తులు

    జూబ్లీహిల్స్‌లోని పోష్ ఏరియాలో బ్రహ్మానందానికి కోట్ల విలువైన ఇల్లు ఉందని, దాంతో పాటు కోట్ల రూపాయల విలువ చేసే అగ్రికల్చరల్ ల్యాండ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది

    ఇండస్ట్రీలోకి

    ఇండస్ట్రీలోకి

    అత్తిలిలో లెక్చరర్‌గా కెరీర్ ప్రారంభించిన బ్రహ్మానందం నిజ జీవితంలోని వ్యక్తులను అనుకరుణ చేస్తూ అందరి ప్రశంసలూ పొందేవారు. 1985లో దూరదర్శన్లో వచ్చిన 'పకపకలు' కార్యక్రమాన్ని సమర్ధంగా నిర్వహించగా మంచి స్పందన వచ్చింది. బ్రహ్మానందంను మొట్టమొదటి సారిగా మూవీ కెమెరా ముందు మేకప్ వేసి నిలబెట్టినవారు దర్శకులు వేజళ్ల సత్యనారాయణ. నరేశ్ కథానాయకుడిగా నటించిన 'శ్రీ తాతావతారం' అనే చిత్రంలో కథానాయకుడి నలుగురు స్నేహితులలో ఒకడిగా నటించారు. విశేషం ఏమిటంటే తన పుట్టినరోజు ఫిబ్రవరి 1వ తేదీన ఆ సినిమాలో తొలి వేషం వేశాడు. 1985లో హైదరాబాద్ వెస్లీ కాలేజ్‌లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు హీరో నరేశ్‌తో తీసిన తొలి షాట్ బ్రహ్మానందం నటజీవితానికి శ్రీకారం చుట్టింది.

    వెయ్యికి పైగా సినిమాలు

    వెయ్యికి పైగా సినిమాలు

    వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మానందం ఇప్పటికే చరిత్ర సృష్టించారు. అంతకు ముందే అత్యధిక చిత్రాల్లో నటించిన కమెడియన్‌గా గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకున్న బ్రహ్మానందం దాసరి దర్శకత్వంలో వచ్చిన ‘ఎర్ర బస్సు' చిత్రంతో 1000 సినిమాల మార్కును అందుకున్నారు.

    అదే ఆయన స్టైల్

    అదే ఆయన స్టైల్

    నటించిన ప్రతి సినిమాలోనూ ప్రేక్షకులను నవ్విస్తూ...హాస్యానికి కొత్త ఒరవడితో కేవలం హావభావాతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టడం బ్రహ్మానందం స్టైల్. అత్యధిక చిత్రాలలో నటించిన నటుడిగా గిన్నిస్‌బుక్‌ రికార్డును సైతం అందుకున్న బ్రహ్మి కేంద్ర ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డును సైతం అందుకున్నారు అందుకున్నారు. ఇప్పటికీ ఈయన తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత ఎక్కువ సినిమాలలో నటిస్తూ, ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హాస్య చక్రవర్తి.

    వెరైటీ పాత్రలు

    వెరైటీ పాత్రలు

    బ్రహ్మానందాని బాగా గుర్తింపు తెచ్చిన తొలి పాత్ర ‘అహనా పెళ్లంట' చిత్రంలో అరగుండు పాత్ర. ఆ తర్వాత ఆయన ఖాన్ దాదా, కత్తి రాందాసు, గచ్చిబౌలి దివాకరం పాత్రలతో బాగా పాపులర్ అయ్యారు.

    English summary
    According to sources, it costs Rs 1 crore for the filmmakers to get Brahmanandam sign on the dotted lines. And his current overall financial assets are pegged at Rs 320 crore, according to a Catch News report.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X