»   » కొడుకు తో వచ్చిన నష్టాన్ని పవన్ తో రికవరి

కొడుకు తో వచ్చిన నష్టాన్ని పవన్ తో రికవరి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ లో పాపులర్ డైలాగు "నాక్కొంచెం తిక్కుంది...దానికో లెక్కుంది". ఇప్పుడు అదే టైటిల్ తో బ్రహ్మానందం హీరోగా ఓ చిత్రం రూపొందనుందని సమాచారం. బసంతి చిత్రం నిర్మాతలు ఈ చిత్రం ప్రొడ్యూస్ చేయనున్నారని తెలుస్తోంది. తన కుమారుడు తో నిర్మించిన బసంతి తో డబ్బు పోగొట్టుకోవటంతో ఈ చిత్రంలో తాను ఉచితంగా నటిస్తారని, అందుకే ఒప్పుకున్నారని తెలుస్తోంది. పవన్ కి ఉన్న క్రేజ్ తో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయవచ్చని భావిస్తున్నారు.

1986లో విడుదలైన 'చంటబ్బాయ్' బ్రహ్మానందం నటించిన తొలి చిత్రం. ఆ చిత్రం విడుదలకు రెండేళ్ల ముందే బహ్మీ సినిమా రంగంలో ప్రవేశించారు. నట ప్రస్థానంలో 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ....పరిశ్రమలో తాను ఈ స్థాయికి ఎదగడానికి ఎంతో మంది సహకరించారని, వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు బ్రహ్మానందం తెలిపారు.

Brahmanandam to play hero again?

బ్రహ్మానందం నటుడిగా తన ప్రయాణంలో 3 దశాబ్దాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఊపిరి ఉన్నంత వరకూ ప్రేక్షకులకు వినోదం పంచుతూనే ఉంటానని స్పష్టం చేసారు. నవ్వించడం అనేది దేవుడు నాకు ఇచ్చిన వరంగా పేర్కొన్న బ్రహ్మానందం....దీన్ని ఆపే ప్రసక్తే లేదని, ఊపిరి ఉన్నంత కాలం నవ్విస్తూనే ఉంటానని తెలిపారు.

ఇప్పటికే 950కిపైగా చిత్రాల్లో నటించిన ఆయన త్వరలో 1000 చిత్రాల మార్కును దాటబోతున్నారు. ప్రతి సినిమాలోనూ ప్రేక్షకులను నవ్విస్తూ...హాస్యానికి కొత్త ఒరవడితో కేవలం హావభావాతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టడం బ్రహ్మానందం ప్రత్యేకత. అత్యధిక చిత్రాలలో నటించిన నటుడిగా గిన్నిస్‌బుక్‌ రికార్డును సైతం అందుకున్న బ్రహ్మి కేంద్ర ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డును సైతం అందుకున్నారు అందుకున్నారు. ఇప్పటికీ ఈయన తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత ఎక్కువ సినిమాలలో నటిస్తూ, ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హాస్య చక్రవర్తి.

English summary
Brahmanandam is now all set to don the leading man’s cap again. The title of the film is interesting, "Nakkonchem Tikkundi Daniko Lekkundi".
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu