»   »  ‘ఇద్దరమ్మాయిలతో' లో ఆ సీన్స్ కోత

‘ఇద్దరమ్మాయిలతో' లో ఆ సీన్స్ కోత

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం మొన్న శుక్రవారం(మే 31)న గ్రాండ్‌గా విడుదలయిన సంగతి తెలిసిందే. చిత్రం మార్నింగ్ షో కే నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రంలో సీన్స్ కోత మొదలైంది. మొదటిగా ఈ కోత బ్రహ్మానందం, అలీ సీన్స్ పై పడింది.

అలీ,బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సీన్స్ కు పూరీ జగన్నాధ్ సినిమాలు మొదటి నుంచి పెట్టింది పేరు. పోకిరి,సూపర్,చిరుత,కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. అయితే తాజాగా వచ్చిన 'ఇద్దరమ్మాయిలతో' ఆ సీన్స్ అసలు పండలేదు. అన్ని చోట్ల నుంచి ఈ సీన్స్ చెత్తాయని టాక్ వచ్చింది.

దాంతో రియలైజ్ అయిన టీమ్ వెంటనే ఆ సీన్స్ పై కోత వేసారు. సెకండాఫ్ లో వచ్చే బ్రహ్మి,అలీ ట్రాక్ పూర్తిగా ఎత్తివేసారు. ఉన్నంతంలో కాస్త బోర్ తగ్గి సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని భావిస్తున్నారు.


మరో ప్రక్క ఈ చిత్రంలో అల్లు అర్జున్ కులాల మీద చెప్పిన డైలాగులు చర్చనీయాంసంగా మారాయి. ఈ డైలాగులు హైలెట్ గా నిలిచి సినిమాని నిలబెడతాయని చాలా మంది అంచనాలు వేసారు. నిజానికి ఇటీవల కాలంలో ఏ తెలుగుసినిమా లోనూ కనిపించిని కాస్ట్ పీలింగ్ ఈ చిత్రంలో వ్యక్తమయ్యింది. డైలాగ్స్ తో ఆకట్టుకునే పూరీ జగన్నాధ్ ఈ సారి కలాన్ని కులం సిరాలో కలిపి రాసారు. హీరో,హీరోయిన్ల పెళ్లి మాటల సందర్భంలోనూ, వారి ప్రేమ సన్నివేశాల్లోనూ కులాల గోల మరీ ఎక్కువైంది. తన భార్య ఎలాగూ స్నేహా రెడ్డి కాబట్టి.. ఇలా పెట్టించాడా....సరదాకోసం చేసాడా అన్నది చర్చనీయాంసంగా మారింది.

English summary

 
 After receiving a lot of criticism for the comedy track featuring Brahmanandam and Ali in the recent release 'Iddarammayilatho', makers have chopped off those scenes from the film to make the product more viewer-friendly.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu