»   »  'బ్ర‌హ్మోత్స‌వం' పై షాకిచ్చే రూమర్స్ , మరో ప్రక్క మహేష్ ట్వీట్.. ఫొటోలతో

'బ్ర‌హ్మోత్స‌వం' పై షాకిచ్చే రూమర్స్ , మరో ప్రక్క మహేష్ ట్వీట్.. ఫొటోలతో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కొన్ని రూమర్స్ చాలా నమ్మశక్యంగా లాజిక్స్ అనే మేకప్ వేసుకుని నమ్మించే ప్రయత్నం చేస్తాయి. అయితే కొన్నివినగానే ఇవి రూమర్స్ ...అని అర్దమైపోతుంది. అయితే అదే సమయంలో నిప్పులేకుండా పొగ ఎలా పుడుతుంది... ఎక్కడో ఏదో మూల ఏమో నిజంగా జరిగే ఉంటుంది అనే సందేహం కూడా కలుగుతుంది. అక్కడే , ఆ పాయింట్స్ దగ్గరే రూమర్స్ స్ప్రెడ్ చేసినవారు సక్సెస్ అవుతారు. ఇలాంటి రూమర్సే బ్రహ్మాత్సవం టీమ్ కు తలనొప్పిగా మారాయి.

అదేంటో కానీ మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి చేస్తున్న బ్రహ్మోత్సవం చిత్రం గురించి ప్రారంభం నుంచీ ఏదో ఒక రూమర్ వెబ్ మీడియాలో ప్రత్యక్ష్యమవుతూనే ఉంది. అయితే ఈ విషయమై ఆ టీమ్ ఎక్కడా స్ట్రైయిట్ గా ఖండించటం లేదు కానీ ఆ రూమర్ పూర్తి స్దాయిలో స్ప్రెడ్ కాకుండా నిర్ణయాలు తీసుకుని అవి ఒట్టిదే అని తేల్చేస్తోంది.


Also Read: సమంతతో మహేష్ బాబు సరసాలు... (ఫోటోస్ లీక్)


తాజాగా తమ టీమ్ లాంగ్ షెడ్యూల్ హరి ద్వార్ లో పూర్తి చేసుకువచ్చిందని మహేష్ ట్వీట్ సైతంచేసారు. అక్కడ ఫొటోలు కూడా ఇదిగోఇలా అందించారు.కానీ ప్రతీసారి సాక్ష్యం ఇచ్చి రూమర్స్ ఖండించలేరు కదా..


తాజాగా మరో రూమర్ మొదలై , మహేష్ అభిమానులను కంగారు పెడుతోంది. ఆ రూమర్ ఏమిటీ అంటే ఇప్పటివరకూ జరిగిన షూటింగ్ కు సంభిందించిన అవుట్ పుట్ ని చూసిన మహేష్ తనకు నచ్చలేదని అన్నాడని, రీ షూట్ పెట్టుకోమని చెప్పాడనీను. అయితే ఏ హీరో కూడా పూర్తి షూటింగ్, ఎడిటింగ్ వెర్షన్ చూడకుండా అలాంటి సలహాలు అయితే ఇవ్వడనేది నిజం.


ఇంకేం రూమర్స్ వచ్చాయో, అసలు నిజాలేంటో స్లైడ్ షోలో చూద్దాం..


ఫైనల్ అవుట్ పుట్ లో

ఫైనల్ అవుట్ పుట్ లో

మహేష్ కు అవుట్ పుట్ నచ్చలేదంటే..దర్శకుడు ఫైనల్ ఎడిట్ లో చూసుకుందామన్నాడనేది ప్రచారంలో ఉన్న రూమర్. సాధారణంగా అలాంటి టాపిక్ వస్తే... హీరో చెప్పిందే దర్శకులు అనుసరిస్తూంటారు.


ప్యాచ్ వర్క్ వద్దు

ప్యాచ్ వర్క్ వద్దు

ఏది ఉన్నా సెట్ లోనే చూసుకోవాలి కానీ, తర్వాత ప్యాచ్ వర్కులు పెట్టద్దు అని మహేష్ సూచన అనేది రూమర్. నిజానికి ప్యాచ్ వర్క్ అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. బెటర్ మెంట్ కోసం కానీ, ఎడిటింగ్ లో మిస్సైన షాట్స్ కోసం కానీ పెడుతూంటారు.


లింక్ లు లేవుq

లింక్ లు లేవుq

సీన్స్ మధ్య సరైన లింక్ లు లేవు అని మహేష్ ,దర్శకుడుతో అన్నాడనేది ప్రచారంలో ఉన్న రూమర్. నిజానికి అలాంటివి ఏమన్నా జరిగితే ఫైనల్ ఎడిటింగ్ తర్వాతే తెలుస్తాయి..తప్ప..ఈ దశలో బయిటపడటం,హీరో హెచ్చరించటం అంత సీన్ ఉండదు.బడ్జెట్ పెరిగింది

బడ్జెట్ పెరిగింది

సాధారణంగా పెద్దహీరోలందరి సినిమాలకు వచ్చే సమస్యే ఇది. ఇలాంటి రూమర్ వల్ల దర్శకుడుకు తప్ప ఎవరికీ పెద్దగా నష్టం ఉండదు. దర్శకుడుని కూడా రిజల్ట్ బట్టే ఇలాంటివి అంచనా వేస్తారు.


క్లారిటీ లేకుండా

క్లారిటీ లేకుండా

దర్శకుడు క్లారిటీ లేకుండా సినిమా తీస్తున్నాడని మహేష్ కోపగించుకున్నాడని ప్రచారంలో ఉన్న రూమర్. అయితే శ్రీకాంత్ అడ్డాల కొత్త దర్శకుడు ఏమీ కాదు. అలాగే మహేష్ తో ఆయనకు తొలిసారి ఏమీ కాదు. అంత క్లారిటీ లేకుండా తీయటానికి అనేది వాస్తవం.స్క్రిప్టు మార్పులు

స్క్రిప్టు మార్పులు

సినిమా సగంలో ఉండగా మహేష్ బాబు ..స్క్రిప్టు ని మార్చమన్నాడని ప్రచారంలో ఉన్న రూమర్. మహేష్ వంటి పెద్ద హీరోలు ఎప్పుడూ అలాంటి పనులు చేయరు. ఎందుకంటే కొద్ది రోజులు లేటైనా స్క్రిప్టు పూర్తిగా లాక్ అయిన తర్వాత మాత్రమే షూటింగ్ వెళ్తారుకాబట్టి.రాఘవేంద్రరావు

రాఘవేంద్రరావు

ఈ విషయంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇన్వాల్వ్ అయ్యారని, ఆయన స్క్రిప్టు విని, హీరో క్యారక్టరైజేషన్ మార్చమని, పరుచూరి బ్రదర్శ్ ని రంగంలోకి దింపినట్లు ప్రచారంలో ఉన్న రూమర్. అయితే అందుతున్న సమాచారం ప్రకారం అసలు రాఘవేంద్రరావుకు ఈ ప్రాజెక్టు కి సంభందమేలేదు.లొకేషన్ లో రాయటం

లొకేషన్ లో రాయటం

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రం లొకేషన్ లో సీన్స్, డైలాగులు రాస్తున్నాడని, దానికి మహేష్ ఇష్టపడటం లేదని ప్రచారంలో ఉన్న రూమర్. అయితే లొకేషన్స్ లో సీన్స్, డైలాగులకు ఇంప్రవైజేషన్స్ కొంతవరకూ ఖచ్చితంగా ఉంటాయి. వాటిని ఏ హీరో కూడా అడ్డుకోడనేది సినిమావాళ్లందిరికీ తెలుసున్నదే.ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు

ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు

శ్రీమంతుడు హై సక్సెస్ ని చూసి ఓర్వలేని యాంటి ప్యాన్స్ ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారని మహేష్ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ రూమర్స్ కు స్దానం..వెబ్ మీడియా, సోషల్ మీడియా. వీటి నుంచి వార్తలు క్యారీ చేసే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా. ఎవరూ ఖరారు చేసుకుని న్యూస్ చేసే పరిస్దితి ఈ రోజు లేదు.మహేష్ కు తెలుస్తున్నాయి

మహేష్ కు తెలుస్తున్నాయి

ఈ సినిమాపై వస్తున్న రూమర్స్ ఎప్పటికప్పుడు మహేష్ కు చేరుతున్నాయని తెలుస్తోంది.చెక్ చెప్పటానికే

చెక్ చెప్పటానికే

ఈ రూమర్స్ కు చెక్ పెట్టడానికి, తమ చిత్రం అప్ డేట్స్ ఎప్పటికప్పుడు మీడియాకు వెల్లడి చేయాలని మహేష్ చెప్పాడని తెలుస్తోంది.దర్శకుడు కాన్ఫిడెంట్ గా

దర్శకుడు కాన్ఫిడెంట్ గా

ఈ రూమర్స్ , వార్తలు పట్టించుకోకుండా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఈ చిత్రం షూటింగ్ చేసుకుపోతున్నట్లు సమాచారం.
English summary
Mahesh's Brahmostsavam movie has high expectations among the Superstar fans and the gossips and rumors regarding this movie are being flying high.Mahesh Babu also shares some photographs from the Haridwar and Udaipur schedule and tweets this, “After a long schedule in Haridwar n Udaipur, finally back in town... Only to shoot some more :) #Brahmotsavam.”
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu