For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాలీవుడ్ రేంజ్‌లో ‘గాడ్ ఫాదర్’: చిరంజీవి కోసం రంగంలోకి దిగుతున్న బ్రిట్నీ స్పియర్స్

  |

  దాదాపు నలభై ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆరు పదుల వయసులోనూ అదే గ్రేస్‌తో సత్తా చాటుతోన్న ఆయన.. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత జోష్‌తో కనిపిస్తున్నారు. ఇందులో భాగంగానే గతంలో ఎన్నడూ లేనంత వేగంగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. 'ఖైదీ నెంబర్ 150'తో చిత్ర పరిశ్రమలోకి రీఎంట్రీ ఇచ్చిన ఆయన.. అది సూపర్ డూపర్ హిట్ అవడంతో.. వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పలు చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అందులో ఇప్పటికే 'ఆచార్య' అనే సినిమాను పూర్తి చేసేశారు.

  Monal Gajjar ఇన్‌స్టా నుంచి పిచ్చి పిచ్చి ఫొటోలు: అనుమానాలు మొదలు.. షాకింగ్ న్యూస్ చెప్పిన అఖిల్

  'ఆచార్య' షూటింగ్ జరుగుతుండగానే మెగాస్టార్ చిరంజీవి పలు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టారు. అందులో 'గాడ్ ఫాదర్' ఒకటి. సీనియర్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీ రాజ్ మలయాళంలో తెరకెక్కించిన చిత్రం 'లూసీఫర్'. ఈ సినిమా తెలుగు సహా దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని చోట్లా దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు దీన్నే 'గాడ్ ఫాదర్'గా చిరంజీవి రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కిస్తున్నాడు. పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఇటీవలే ఆరంభం అయింది.

  Britney Spears will Onboard for Chiranjeevis God Father

  'లూసీఫర్' మూవీని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేశాడు దర్శకుడు మోహన్ రాజా. అలాగే, ఇందులో హీరోయిన్ పాత్రను కూడా యాడ్ చేశాడు. అలాగే హీరో ఎలివేషన్స్ సీన్స్‌ను కూడా మరిన్ని ఎక్కువగా పెట్టబోతున్నారని అంటున్నారు. ఇక, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను ప్రత్యేకంగా రూపొందించి.. ఇందులో కొంత సెంటిమెంట్ పార్ట్‌ను కూడా జోడించారనే టాక్ వినిపిస్తోంది. ఇలా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఎన్నో ఆసక్తికరమైన అంశాలు బయటకు రావడంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మరో సెన్సేషనల్ న్యూస్ వైరల్ అవుతోంది.

  బీచ్‌లో లవర్‌తో పాయల్ రాజ్‌పుత్ రచ్చ: బికినీలో అందాలన్నీ చూపిస్తూ.. షాకిస్తోన్న సెల్ఫీ వీడియో

  'గాడ్ ఫాదర్' మూవీకి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న అతడు.. చిరంజీవితో చేయబోయే ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడట. ఇందులో భాగంగానే సినిమాలో ఓ పాట పాడించేందుకు ప్రఖ్యాత పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్‌ను తీసుకు రాబోతున్నాడని తెలుస్తోంది. థీమ్ సాంగ్‌లా ఉండే ఓ నెంబర్‌ను ఆమెతో పాడించడానికి ఇప్పటికే చర్చలు కూడా జరిపాడన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది. ఇదే నిజమైతే 'గాడ్ ఫాదర్' రేంజ్ కూడా అమాంతం పెరిగిపోతుందనడంలో సందేహం లేదు.

  క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న 'గాడ్ ఫాదర్' సినిమాలో చిరంజీవి రాజకీయాల్లో చక్రం తిప్పే వ్యక్తిగా నటిస్తున్నారు. అందుకే ఈ చిత్రానికి ఆ టైటిల్ పెట్టారు. ఇక, ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమై శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తుందని తెలుస్తోంది. ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలీవుడ్ యువ విలక్షణ హీరో సత్యదేవ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. థమన్ సంగీతం అందించబోతున్నాడు. సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రను చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

  English summary
  Tollywood Star Hero Megastar Chiranjeevi doing God Father Under Mohan Raja Direction. Britney Spears will Onboard for This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X