బన్నీ.. .మళ్ళీ రిస్కేందుకు చెప్పు!
Recommended Video

అల్లు అర్జున్ స్టార్ హీరోగా మంచి ఫాం లో ఉన్నాడు. మరి ఈ సమయంలో కొత్త దర్శకులతో ప్రయోగం చేసేందుకు ఎవరూ సాహసించరు. ఇది వరకు అల్లు అర్జున్ ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండేవాడు. కానీ కొంతకాలంగా బన్నీ యాటిట్యూడ్ లో మార్పు వచ్చినట్లుగా కనిపిస్తోంది.
ప్రస్తుతం కొత్త దర్శకుడు వక్కతం వంశీతో సినిమా చేస్తున్న ఈ స్టైలిష్ స్టార్. స్టార్ రైటర్‌గా వక్కంతం వంశీ అందరికీ తెలిసినవాడే అయినా.. పలు బ్లాక్ బస్టర్స్‌కు కథ అందించినా.. దర్శకుడిగా అవకాశం ఇచ్చేందుకు చాలామంది ఆలోచించారు. కానీ బన్నీ మాత్రం నా పేరు సూర్య చిత్రానికి డైరెక్షన్ అవకాశం ఇచ్చాడు. మరి ఆ ఫలితం ఇంకా చూడకుండానే..ఇప్పుడు మరో కొత్త దర్శకుడికి కూడా అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

సంతోష్ రెడ్డి అనే ఔత్సాహిక దర్శకుడు చెప్పిన కథ బన్నీకి బాగా నచ్చేసిందిట. కేవలం ఒకే సిట్టింగులోనే సినిమా తెరకెక్కించేందుకు కూడా యాక్సెప్ట్ చేసేశాడట. స్క్రిప్ట్ కూడా దాదాపుగా ప్రిపేర్డ్ గా ఉండడంతో వీలైనంత త్వరగా షూటింగ్ మొదలుపెడదామని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
నా పేరు సూర్య చిత్రం తర్వాత సంతోష్ రెడ్డి సినిమానే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
అయితే వరుసగా రెండో చిత్రంలో కూడా కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చి.. అల్లు అర్జున్ పెద్ద రిస్క్ చేస్తున్నాడేమో అని సిని వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయ్.. అయితే సబ్జెక్టుపై పూర్తి కాన్ఫిడెన్స్ ఉండటంతోనే బన్నీ సంతోష్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్నది టాక్.


Click it and Unblock the Notifications











