»   » బన్నీ 'రేసు గుర్రం' స్టోరీలైన్ ఇదేనా?

బన్నీ 'రేసు గుర్రం' స్టోరీలైన్ ఇదేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'రేసు గుర్రం'. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రుతిహాసన్‌, సలోని హీరోయిన్స్. నల్లమలుపు శ్రీనివాస్‌, కె.వెంకటేశ్వరరావు నిర్మాతలు. రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. ఆ రెండు పాటల్నీ త్వరలో హైదరాబాద్‌లో తెరకెక్కిస్తారు. ఈ చిత్రంలో పోలీస్ అధికారి అయిన అన్న కోసం తమ్ముడు అల్లు అర్జున్ చేసే సాహసాల సమాహారమే చిత్రం అంటున్నారు. అన్నకోసం ఓ పరవ్ ఫుల్ పొలిటీషన్ ని ఎదిరించి,అతన్ని ఓ రేంజిలో ఢీ కొనే సీన్స్ తో కథ సాగుతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో ఈ కథ గురించి చెప్పుకుంటున్నారు. బాధ్యతాయుతమైన ఓ యువకుని కథాంశంతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ శక్తిమంతమైన పాత్ర పోషిస్తున్నారు.

దర్శకుడు సురేంద్రరెడ్డి మాట్లాడుతూ... పోటీలో అలసత్వానికి చోటు లేదు. చూద్దాం, చేద్దాం అంటే కుదరదు. మరొకడు.. మనల్ని దాటుకొంటూ పోతాడు. రేసు మొదలైందంటే.. పూర్తయ్యే వరకూ దౌడు తీయాల్సిందే. అతనూ అదే చేశాడు. అనుకొన్న లక్ష్యాన్ని చేరుకొనే వరకూ పట్టువీడని పోరాటం చేశాడు. ఇంతకీ ఈ రేసు ఎవరి కోసం, ఎందుకోసం..? తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు సురేందర్‌రెడ్డి.

Bunny's Race Gurram shoot is almost done

నిర్మాత మాట్లాడుతూ.... ''యాక్షన్‌, వినోదాల మేళవింపు ఈ చిత్రం. బన్నీ పాత్ర చిత్రణ, స్క్రీన్‌ప్లే వైవిధ్యంగా ఉంటాయి. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వస్తోంది. ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అన్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన రేసీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. భోజపురి హీరో రవి కిషన్ విలన్ గా చేయటం సినిమాకు బాగా కలిసి వస్తుందని చెప్తున్నారు.

అలాగే సంక్రాంతికి విడుదల అవుతుందనుకున్న ఈ చిత్రం పిభ్రవరికి వాయిదా పడింది. ఈ కొత్త విడుదల తేదీ పిభ్రవరి 7 అని తెలుస్తోంది. ఎవడు చిత్రం సంక్రాంతికి రావటం, అలాగే పూర్తై ఫస్ట్ కాపీ పట్టటానికి ఇంకా రెండు నెలలు సమయం పట్టేటట్లు ఉందని అందుకే విడుదల ను ముందుకు నెట్టారని చెప్తున్నారు. అయితే ఫిబ్రవరి అనేది డల్ సీజన్ కాబట్టి మార్చి చివర నెలలోకి వెళ్లే అవకాసం ఉందని ట్రేడ్ లో అంచనాలు వేస్తున్నారు.


కోట శ్రీనివాసరావు, సుహాసిని మణిరత్నం, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎస్.తమన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు, నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్.

English summary
The principal shoot is almost done; balance song shoot is presently at Hyderabad. Allu Arjun is trying hard to bounce back with his upcoming film “Race Gurram”. Meanwhile the film makers are planning to release the film in February 2014. Allu Arjun is pairing up with Shruthi Haasan and Saloni in the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu