For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లూసిఫర్ రీమేక్.. మెగా ఆఫర్‌ను ఆయన తిరస్కరించాడా?.. వైరలవుతోన్న వార్త

  |

  మెగా ఫ్యామిలీ నుంచి ఓ ఆఫర్ ఎవరి దగ్గరికైనా వెళ్తే.. రిజెక్ట్ చేయడానికి ఎవ్వరూ కూడా సాహసించలేరు. అందులోనూ చిరంజీవి సినిమాను తెరకెక్కించాలనే చాన్స్ వస్తే ఎగిరి గంతేస్తారు. అయితే చిరును డైరెక్ట్ చేయడమంటే కత్తిమీద సాములాంటింది. అన్ని విషయాలను జాగ్రత్తగా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఏమాత్రం తేడా కొట్టినా ఫ్యాన్స్ ఆగ్రహానికి గురి కావల్సి వస్తుంది. తాజాగా చిరంజీవితో సైరా చిత్రాన్ని తెరకెక్కించిన సురేందర్ రెడ్డిపై అన్నివైపుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి.

  టైమ్ కావాలని అడిగిన దర్శకుడు..

  టైమ్ కావాలని అడిగిన దర్శకుడు..

  సైరా చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వ బాధ్యతలు చేపట్టాలని చెప్పిన వెంటనే.. కాస్త గడువు కావాలని అడిగాడు. చిరు సినిమాకు తాను డైరెక్టర్ ఏంటి అని షాక్‌లో ఉండటం, కథ గురించి పూర్తిగా తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యేందుకు కాస్త గడువును తీసుకున్నట్లు స్వయంగా దర్శకుడే తెలిపాడు. అలా చిరు సినిమాను తెరకెక్కించాలంటే దర్శకుడిపై ఎన్నో ఒత్తిళ్లు కూడా ఉంటాయి. అయినా వాటన్నంటిని అధిగమించి సైరాను అద్బుతంగా తెరకెక్కించాడు సురేందర్ రెడ్డి.

  ప్రస్తుతం కొరటాల మూవీతో చిరు బిజీ..

  ప్రస్తుతం కొరటాల మూవీతో చిరు బిజీ..

  తెలుగు రాష్ట్రాల్లో సైరా అద్బుత విజయాన్ని నమోదు చేయడంతో మంచి హుషారుగా ఉన్న చిరు.. తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రారంభించేరు. భరత్అనేనేను చిత్రం పూర్తయ్యాక చిరు కోసం అద్భుతమైన స్క్రిప్ట్‌ను రెడీ చేసిన కొరటాల.. గత ఏడాదిగా దానికి మరిన్ని మెరుగులు దిద్దుతూనే ఉన్నాడు. సైరా విడుదల ఆలస్యం అవుతూ ఉండటంతో తన స్క్రిప్ట్‌కు కావాల్సినంత టైమ్ దొరికింది. ఎట్టకేలకు ఈ మూవీ పూజా కార్యాక్రమాలను పూర్తి చేసుకుని షూటింగ్‌కు వెళ్లేందుకు సిద్దమైంది.

  రీమేక్‌పై ఆసక్తి..

  రీమేక్‌పై ఆసక్తి..

  ఇటీవలె మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన లూసిఫర్‌పై మెగాస్టార్ మనసుపడ్డాడు. ఈ చిత్రంలో తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది కూడా. అయితే ఈ మూవీ ఇక్కడి ప్రేక్షకులకు అంతగా ఎక్కలేదు. ఈ సినిమా కథ చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నా.. ఇక్కడి నేటివిటీ లోపించడం వల్ల అంతగా ఎక్కలేదు. అలాంటి కథపై చిరంజీవి మనసు పారేసుకున్నాడు. వెంటనే లూసిఫర్ హక్కులను కూడా చేజిక్కించుకున్నారు.

  లూసిఫర్ దర్శకుడు సుకుమార్ అంటూ..

  లూసిఫర్ దర్శకుడు సుకుమార్ అంటూ..

  లూసిఫర్‌ను తెరకెక్కించే బాధ్యతలు సుకుమార్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా అందించిన సమాచారం మేరకు సుకుమార్ ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కించినట్టు తెలుస్తోంది. తాను సొంత కథతోనే చిరంజీవితో సినిమాను తెరకెక్కిస్తానని, రీమేక్ చేయలేనని తెగేసి చెప్పేశాడని టాక్. దీంతో మరో దర్శకుడిని వెతికే పనిలో పడ్డారని తెలుస్తోంది.

  కొణిదెల ప్రొడక్షన్స్‌లో..

  కొణిదెల ప్రొడక్షన్స్‌లో..

  కొణిదెల ప్రొడక్షన్స్‌లో తెరకెక్కనున్న ఈ మూవీకి దర్శకుడిని వెతకడం మేకర్స్‌కు కత్తిమీదసామైందని తెలుస్తోంది. చిరు ఇమేజ్‌ను, కథకథాలను ఇక్కడి నేటివిటీకి తగ్గట్టు మార్చగల టాలెంటెడ్ డైరెక్టర్‌ను వెతికిపట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. మరి లెక్కల మాష్టారు నో చెప్పేశాడు.. చివరకు ఎవరు ఫిక్స్ అవుతారో చూడాలి.

  English summary
  Buzz Is That Sukumar Rejected Lucifer Remake Offer. He Wanted To Direct Chiranjeevi With New Subject, Doesn't Want To Remake.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X