»   » నిజమా? :టీవీ9 అమ్మేస్తున్నారా..ఎవరు కొంటున్నారు? ఎంతకి?

నిజమా? :టీవీ9 అమ్మేస్తున్నారా..ఎవరు కొంటున్నారు? ఎంతకి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తెలుగులో నెంబర్ వన్ న్యూస్ ఛానెల్ గా వెలుగుతున్న టీవీ 9 త్వరలో చేతులు మారబోతోందంటూ వార్తలు మీడియా సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. అంతేకాదు...ఇందుకు సంభందించిన ఓ వాట్సప్ మెసేజ్ కూడా చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఎవరు కొనబోతున్నారు. ఆ వాట్సప్ మెసేజ్ లో ఏముంది అనేది మీకు తెలియటం కోసం ఈ ఆర్టికల్ అందిస్తున్నాం....ఆ వాట్సప్ మెసేజ్ యధాతథంగా...


"అవును, ఇది నిజం. తెలుగు న్యూస్ మీడియాలో మ‌రో సంచ‌ల‌నానికి వేదిక రెడీ అవుతోంది. రేపోమాపో వార్తాప్ర‌పంచంలో బహిరంగంగా వినిపించ‌బోయే బ్రేకింగ్ న్యూస్ ఇదే కావ‌చ్చు. తెలుగు మీడియా ప్ర‌పంచంలో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన టీవీ9 త్వ‌ర‌లోనే చేతులు మార‌బోతోంది.

ప‌దేళ్లుగా ఆంధ్రా రాజుల చేతిలో ఉన్న టీవీ9.. అతి త్వ‌ర‌లోనే తెలంగాణ దొర‌ల చేతికి అంద‌బోతోంది. టీవీని ద‌క్కించుకుంటోంది ఎవ‌రో కాదు..  తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కి అనుంగు స‌న్నిహితుడు, మై హోమ్ బిల్డ‌ర్స్‌, మ‌హా సిమెంట్స్ వంటి ఎన్నో బిజినెస్‌లను స‌క్సెస్‌ఫుల్‌గా నిర్వ‌హిస్తున్న జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావు.

ఎస్‌.. ఇది వాస్త‌వం. జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావు.. టీవీ9ని ద‌క్కించుకున్నారట‌.

గ‌త నాలుగేళ్లుగా టీవీ9 చేతులు మారుతోందంటూ ప‌లు బ్రేకింగ్‌లు వ‌చ్చాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి ప‌లు బ‌డా కార్పొరేట్ సంస్థ‌ల‌తో పాటు పీవీపీ లాంటి వాళ్లు కూడా కొన‌బోతున్నారంటూ ప‌త్రిక‌ల‌లో బ్యాన‌ర్ ఐట‌మ్స్ వెలిశాయి. అయితే, అవి రూమ‌ర్స్‌కే ప‌రిమిత‌మ‌య్యాయి.

లాస్ట్ మినిట్‌లో డీల్ కుద‌ర‌క‌పోవ‌డం, చిన్న చిన్న టెక్నిక‌ల్ ఇష్యూస్‌తో ఆగిపోవ‌డం వంటివి జ‌రిగాయి. అందుకే, శ్రీనిరాజు ద‌గ్గ‌రే ఉంది టీవీ9. కానీ, రామేశ్వ‌ర‌రావు టీవీ9 కొన‌డం మాత్రం వాస్త‌వం. ఈ బ్రేకింగ్ న్యూస్‌ని త్వ‌ర‌లోనే ఓపెన్‌గా ఎనౌన్స్ చేయ‌డానికి రెడీ అవుతున్నార‌ని ప‌క్కాగా అందిన స‌మాచారం.

దాదాపు భారీ మొత్తానికి టీవీ9ని కొనుగోలు చేయ‌డానికి రామేశ్వ‌ర‌రావు ఆస‌క్తి చూపార‌ట‌.

ఈ డీల్‌ను టీవీ9కి మూల‌స్తంభంగా, ఒక వ్య‌వ‌స్థ‌గా మారడానికి అహ‌ర్నిశ‌లు కృషి చేసిన టీవీ9 సీఈవో ర‌విప్ర‌కాష్ కూడా సుముఖంగా ఉన్నార‌ట‌. ఆయ‌నే ఈ డీల్‌ని స్వ‌యంగా సెట్ చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇటు, ప్రెజెంట్ మేనేజ్‌మెంట్  శ్రీనిరాజు, అటు త్వ‌ర‌లోనే రాబోతున్న మేనేజ్‌మెంట్‌ రామేశ్వ‌ర‌రావు మ‌ధ్య అనుసంధాన క‌ర్త‌గా ఉండి మొత్తం వ్య‌వ‌హారాన్ని ద‌గ్గ‌రుండి మ‌రీ ఆయ‌నే ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు స‌మాచారం.

అంతేకాదు, ఇటు రామేశ్వ‌రరావు త‌న స‌న్నిహితులు, శ్రేయోభిలాషుల‌తో టీవీ9ని కొనుగోలు చేశాన‌ని చెప్పుకుంటున్నారట‌. ఇటు, శ్రీనిరాజు కూడా న్యూస్ మీడియా నుంచి తాను బ‌య‌టికి వ‌స్తున్న‌ట్లు త‌న ఫ్రెండ్స్‌, బిజినెస్ మేట్స్‌తో డీల్ గురించి షేర్ చేసుకుంటున్నార‌ట‌.

Buzz: TV9 for Sale!

తెలుగులోనే కాదు, టీవీ9కి ఇంకా క‌న్న‌డ‌, మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్‌, కేర‌ళ‌తో పాటు ఇంగ్లీష్ చానెల్ న్యూస్ 9 కూడా ఉంది. ఇటు తెలుగులో న‌డుస్తున్న జై తెలంగాణ కూడా ఈ గ్రూప్‌దే. ఇలా దేశ‌వ్యాప్తంగా నెట్ వ‌ర్క్ ఉన్న అతి త‌క్కువ చానెల్స్‌లో టీవీ9 ఒక‌టి. అందుకే, ఎన్నిక‌లకు ముందు టీవీ9 హాట్ కేక్‌లా మారింద‌నే ప్ర‌చారం జ‌రిగింది.

సుమారు వెయ్యి కోట్ల‌కు అమ్ముడుపోతోందంటూ టాక్ వినిపించింది. అయితే, తాజాగా మై హోమ్ రామేశ్వ‌ర‌రావు దానిని 650 కోట్ల‌కు ద‌క్కించుకోవ‌డం విశేషం.

ర‌విప్ర‌కాష్ చేతుల మీద‌గా ఎదిగిన ఈ చానెల్‌ ఇప్పుడు మై హోమ్ ఇండ‌స్ట్రీస్‌, మ‌హా సిమెంట్స్ చైర్మ‌న్ రామేశ్వ‌ర్‌రావు చేతికి వెళుతోంది.

తెలంగాణ‌లో వెల‌మ క‌మ్యూనిటీకి చెందిన ఆయ‌న స‌క్సెస్‌ఫుల్ బిజినెస్‌మేన్‌...ఓ మంచి వ్యాపార‌వేత్త నుంచి మ‌రో మంచి వ్యాపార‌వేత్త‌కు వెళుతోంది టీవీ9...దీంతో చానెల్ భ‌విష్య‌త్తుకు ఎలాంటి ఢోకా ఉండ‌ద‌ని మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

అయితే ఈ మార్పుచేర్పుల‌తో రాజ‌కీయ కూర్పు మాత్రం కొద్దిగా మారుతోంద‌ని, క‌థ‌నాల్లో, కంటెంట్‌లో కొత్త తేడా క‌నిపిస్తోంద‌ని, క‌థ‌నాల‌లో కొత్త ఈక్వేష‌న్స్ కనిపినిస్తున్నాయ‌ని అప్పుడే కామెంట్స్ మొద‌ల‌య్యాయి.


గమనిక...: ఇది వార్తగా ఖరారు అయ్యేంతవరకూ కేవలం రూమర్ గానే భావించండి.

Read more about: టీవీ 9, టీవి, tv9, sale, tv
English summary
If the buzz in the market sources is to be believed, Popular Telugu Channel TV9 and its network of news channels of various languages is put to sale.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu