Don't Miss!
- News
ఏపీ, తెలంగాణకు రైల్వే బడ్జెట్లో రూ. 12,800 కోట్లు: వాటాలు ఇలా, కీలక ప్రాజెక్టులు
- Sports
ILT20 2023: 6 బంతుల్లో 5 సిక్స్‌లు.. డ్రెస్సింగ్ రూమ్‌లో రచ్చ చేసిన యూసఫ్ పఠాన్!
- Finance
భారత్ పై అమెరికా సెనేటర్ ఆరోపణలు.. ఇండియాను దోషిగా నిలబెట్టడమే ధ్యేయం!
- Lifestyle
రాత్రుళ్లు నిద్ర పట్టట్లేదా? ఈ పాదాభ్యంగనం చేస్తే గాఢ నిద్రలోకి ఇట్టే జారుకుంటారు
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Technology
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Waltair Veerayya: రవితేజ హీరోయిన్‌కు బిగ్ షాక్.. తగ్గించారా? మొత్తానికే లేపేశారా?
దాదాపు నలభై ఏళ్లకు పైగా టాలీవుడ్‌లో స్టార్ హీరోగా వెలుగొందుతూ.. ఇప్పటికీ అదే గ్రేస్‌తో కుర్ర హీరోలకు పోటీగా నిలుస్తోన్నారు మెగాస్టార్ చిరంజీవి. రాజకీయాల కోసం చాలా కాలం పాటు సినిమాలకు బ్రేకిచ్చిన ఆయన.. 'ఖైదీ నెంబర్ 150' మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి రెట్టించిన ఉత్సాహంతో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు. ఇలా ఇప్పటికే పలు చిత్రాలతో చిరంజీవి ప్రేక్షకులను అలరించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' అనే సినిమాను చేస్తున్నారు. ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి.
హీరోయిన్‌పై వర్మ సంచలన పోస్ట్: ఆమె రెండు కాళ్లను ఎడం చేసి.. F** అంటూ ఘోరంగా!
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తన 154వ సినిమాగా 'వాల్తేరు వీరయ్య'ను చేస్తోన్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర రూపొందిస్తోన్న ఈ మూవీలో మాస్ మహారాజా రవితేజ కూడా కీలక పాత్రను చేస్తోన్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తైపోయింది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసేసి ప్రేక్షకులకు సినిమాను చేరువ చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.

ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'వాల్తేరు వీరయ్య' మూవీలో రవితేజ కూడా ఎంతో ముఖ్యమైన పాత్రను చేస్తోన్నాడు. ఇక, ఇందులో అతడికి జోడీగా కేథరిన్ థ్రెస్సాను తీసుకున్నారని ఆ మధ్యనే ఓ న్యూస్ లీకైంది. అంతేకాదు, ఆమె పలు షెడ్యూళ్లలో పాల్గొందని కూడా టాక్ వచ్చింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో కేథరిన్ పాత్రకు సంబంధించిన సన్నివేశాలను కట్ చేశారని తెలిసింది. రవితేజ పాత్రను ఎలివేట్ చేయడం కోసమే ఆమెతో ఉన్న సన్నివేశాలను తీసేశారని అంటున్నారు. అయితే, ఈ హీరోయిన్‌ను కొన్ని సీన్స్‌కే పరిమితం చేశారా? లేక మొత్తానికి తీసేశారా? అన్నది సస్పెన్స్‌గా మారింది.
Bigg Boss 7: బిగ్ బాస్ సంచలన నిర్ణయం.. కొత్త హోస్టుగా మంచు హీరో.. బాలకృష్ణ చేసిన పని వల్లే ఇలా!

చిరంజీవి, రవితేజ కలయిక బాబీ రూపొందిస్తోన్న 'వాల్తేరు వీరయ్య' మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 13వ తేదీన విడుదల కాబోతుంది.