»   » చిరు కూతురు గొడవతో ఫినిష్ అనుకున్నారు.. రెమ్యూనరేషన్ షాక్!

చిరు కూతురు గొడవతో ఫినిష్ అనుకున్నారు.. రెమ్యూనరేషన్ షాక్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ కేథరిన్ ఆ మధ్య చిరంజీవి 150వ సినిమాలో రత్తాలు ఐటం సాంగుకు ఎంపికవ్వడం... తర్వాత సెట్స్‌లో ఆమె చిరంజీవి కూతురు, ఆ సినిమాకు స్టైలిస్ట్ గా పని చేస్తున్న సుష్మితతో గొడవ పడి సినిమా నుండి తప్పుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

చిరంజీవి కూతురుతో గొడవ పడటం వల్ల ఆమెకు ఇక టాలీవుడ్లో అవకాశాలు వచ్చే పరిస్థితి ఉండదని, తెలుగులో ఆమె కెరీర్ ఫినిష్ అయినట్లే అనే వాదన అప్పట్లో వినిపించింది. కట్ చేస్తే... ఆ పుకార్లకు తెర దించుతూ మరో సినిమాలో ఐటం సాంగుకు భారీ రెమ్యూనరేషన్ అందుకుని వార్తల్లో నిలిచింది కేథరిన్.

ఊటం సాంగుకు రూ. 65 లక్షలు

ఊటం సాంగుకు రూ. 65 లక్షలు

బెల్లంకొండ శ్రీనవాస్ హీరోగా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమాలో కేథరిన్ తో ఐటం సాంగ్ చేయిస్తున్నారని, ఈ పాట కోసం ఆమెకు రూ. 65 లక్షలు రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఐటం సాంగుకే ఇంతా?

ఐటం సాంగుకే ఇంతా?

స్టార్ హీరోయిన్లే రూ. కోటికి కాస్త అటు ఇటుగా సినిమా మొత్తానికి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అలాంటిది కేవలం ఐటం సాంగుకే కేథరిన్ ఇంత రెమ్యూనరేషన్ తీసుకోవడం ఇపుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

అంతా ఉత్తిదేనా

అంతా ఉత్తిదేనా

చిరంజీవి కూతురుతో గొడవ తర్వాత కేథరిన్ గురించి రకరకాల ప్రచారం జరిగింది. ఓ క్రమంలో ఆమెపై అనధికారికగా నిషేదం అమలులోకి వచ్చినంత పరిస్థితి వచ్చిదంటూ కొందరు రూమర్స్ స్ప్రెడ్ చేసారు. అయితే అదంతా ఉత్తిదే అని తేలిపోయింది.

హీరోయిన్ కేథరన్ సూపర్ హాట్ లుక్

హీరోయిన్ కేథరన్ సూపర్ హాట్ లుక్

అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ఇద్దరమ్మాయిలు, సరైనోడు చిత్రాలతో అందం పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న భామ కేథరిన్. ఈ చిత్రాల్లో కేథరిన్ సెక్సీ ఆటిట్యూడ్, చురుకైన అభినయం ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాలు చేస్తూనే ఫోటో షూట్ల ద్వారా తన అందాలను ప్రదర్శిస్తూ ఫిల్మ్ మేకర్స్ ను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది కేథరిన్. ఫోటోస్ కోసం క్లిక్ చేయండి.

English summary
Catherine Tresa was roped in for a special song in Boyapati Sreenu's film starring Bellamkonda Sreenivas. Reports said that, Bellamkonda has reportedly paid a whopping Rs 65 lakhs to sign Catherine Tresa to shake her booty in a special song in his third film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu