twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరు చిత్రం పోలిక: '...రాంబాబు'సెన్సార్ టాక్...

    By Srikanya
    |

    హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి, వివి వినాయిక్ కాంబినేషన్ లో రూపొంది ఘన విజయం సాధించిన చిత్రం ఠాగూర్. ఈ చిత్రం కమర్షియల్ గా విజయవంతమవటమే కాక క్రిటిక్స్ నుంచీ ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు అలాంటి మ్యాజిక్ మరోసారి రిపీట్ అవుతోంది అంటున్నారు. పవన్‌కళ్యాణ్‌తో పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న భారీ చిత్రం 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు' . రీసెంట్ గా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం చివరి అరగంటా ఠాగూర్ చిత్రాన్ని గుర్తు చేస్తుందంటున్నారు.

    పరిశ్రమలో వినపడుతున్న సెన్సార్ రిపోర్ట్స్ ప్రకారం ఈ చిత్రం ఆఖరి ముప్పై నిముషాలు చాలా ఉద్వేగం భరితంగా నడుస్తుందని చెప్తున్నారు. అలాగే క్లైమాక్స్ లో ఎక్కడెక్కడ జనం రావటం,వారితో పవన్ చెప్పే డైలాగులుకు ధియోటర్స్ లో ఓ రేంజి స్పందన వస్తుందని, ఆ సీన్స్ హైలెట్స్ అవుతాయని అంటున్నారు. పవన్ ఈ సీన్స్ నమ్ముకునే సినిమా చేసాడని అంటున్నారు. పవన్ ఈ చిత్రం ఘన విజయంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడని, డబ్బింగ్ చెప్పేడప్పుడు తన వారికి ఈ విషయం చెప్పటం జరిగిందని సమాచారం.

    పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ - ''మా చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. సినిమా చూసిన సెన్సార్‌ ఆఫీసర్‌ ధనలక్ష్మిగారితోపాటు మిగతా సభ్యులు కూడా చాలా మంచి సినిమా తీశారని అప్రిషియేట్‌ చేశారు. సినిమాని ఎక్కడా టచ్‌ చేయకుండా, ఒక్క కట్‌ కూడా లేకుండా యు/ఎ సర్టిఫికెట్‌ ఇచ్చారు. పవన్‌కళ్యాణ్‌గారి కెరీర్‌లోనే ఇదో ల్యాండ్‌మార్క్‌ మూవీ అవుతుంది. ఆయన పెర్‌ఫార్మెన్స్‌ హైలైట్‌గా ఈ సినిమా వుంటుంది. ఇందులో ఆయన డబ్బింగ్‌లో చెప్పిన డైలాగ్స్‌ చాలా ఎక్స్‌లెంట్‌గా వచ్చాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో చెప్పిన డైలాగ్స్‌కి మంచి అప్రిషియేషన్‌ వచ్చింది. తప్పకుండా ఈ సినిమా చాలా పెద్ద రేంజ్‌లో హిట్‌ అవుతుంది'' అన్నారు.

    నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ - ''ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్‌ సభ్యుల ఎక్సైట్‌మెంట్‌ చూస్తుంటే తప్పకుండా మా బేనర్‌లో ఇదో పెద్ద హిట్‌ సినిమా అవుతుందనిపిస్తోంది. చాలా గొప్ప సినిమా తీశారని సెన్సార్‌ సభ్యులంతా అప్రిషియేట్‌ చేస్తుంటే సినిమా మీద మాకు వున్న నమ్మకం మరింత పెరిగింది. ఇప్పటికే ఆడియో చాలా పెద్ద హిట్‌ అయింది. మణిశర్మగారు చాలా ఎక్స్‌లెంట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. ఓ జర్నలిస్ట్‌కీ, ఓ రాజకీయనాయకునికీ మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా. సమాజం ఎదుర్కొంటున్న ఓ సమస్యను రాంబాబు ఎలా పారద్రోలాడు అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం.. చాలా సీరియస్ మోడ్‌లో సినిమా నడుస్తుంది.'' అన్నారు.

    English summary
    Is Power Star pawan kalyan's 'Cameraman Gangatho Rambabu' going to be another 'Tagore'? With the censor reports being out, the way how the story proceeds is also known from inside sources. Last thirty minutes of the movie reminds us Chiranjeevi's 'Tagore'. Like 'Tagore', CGR has been shot as quite emotional with powerful performance from pawan kalyan. The movie is hitting the screens on 18th October.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X