»   » 'చిరు'తో చిన్న బీట్ కైనా డాన్స్ చేయించాలి అదే నా చిరకాల వాంఛ: ప్లాప్ మ్యూజిక్ డైరక్టర్!

'చిరు'తో చిన్న బీట్ కైనా డాన్స్ చేయించాలి అదే నా చిరకాల వాంఛ: ప్లాప్ మ్యూజిక్ డైరక్టర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ మధ్య ఏ ఫంక్షన్ లో చూసినా మ్యూజిక్ డైరక్టర్ చక్రి వరుస ప్లాప్ లతో చక్రీ దర్శనమిస్తున్నాడు. వరుస ప్లాప్ లతో దిగులు పడిన చక్రి బాలయ్య 'సింహా" చిత్రంతో సక్సెస్ ట్రాక్ మీదకు వచ్చారు. అదే ఉత్సాహంతో గోపిచంద్, పూరీ కాంబినేషన్ లో ఈ రోజు విడుదలైన చిత్రం 'గోలిమార్" కి కూడా సంగీతాన్ని సమకూర్చారు.

'గోలిమార్" ఆడియో కూడా విజయం సాధించడంతో మళ్లీ చక్రి తన వరుస విజయాల బాటను పునరావృతం చేయనున్నాడని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. 'మోనా మోనా.."పాట చెప్పి పూరీ చేసిన ఎక్కువశాతం చిత్రాలకు మ్యూజిక్ డైరక్టర్ గా ఉన్న విషయం తెలిసిందే..ఒకప్పుడు పూరీ చిత్రం అనగానే చక్రి పేరే వినిపించేది. మళ్ళీ అదే జరిగినా ఆశ్చర్య పోనవసరం లేదు.

అయితే జయాపజయాలు ఎప్పుడూ ఉండేవి ఎన్ని విజయాలు ఉన్నా ఎన్ని అపజయాలు ఉన్నా చక్రికి మాత్రం ఒక్కటే బాధగా ఉందట..మెగాస్టార్ చిరంజీవి చిత్రానికి మ్యూజిక్ అందించలేకపోయానే అని, కనీసం ఒక్క పాట కూడా చేయలేక పోయానే అని తరచూ ఇంటర్వూలలో ఆయన చెప్తున్నాడు. చిరుతో చేయలేక పోయినా వాళ్ల అబ్బాయితో చేసి ఆ చిత్రంలో చిన్న బీట్ కైనా డాన్స్ చేయమని చిరంజీవి అన్నయ్యను కోరతానని చక్రి అనుకుంటున్నాడట. మరి చరణ్ చిత్రానికి చక్రికి ఎప్పుడు అవకాశం వస్తుందో వేచి చూడాల్సిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu