twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బన్నీ, జూ ఎన్టీఆర్ లకి రికార్డులు కావాలంటే ఒరిజినాలిటి ఉండాలి..

    By Sindhu
    |

    'బద్రినాథ్" చిత్రంలో అల్లు అర్జున్ జుట్టు చూసి ఇంత పెంచాడంటే ఇతనికి ఎంత ఓపిక అనుకోకండి. నిజానికి ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ కాస్త కండలయితే పెంచాడు కానీ జుట్టు మాత్రం పెంచలేదు. హెయిర్ ఎక్స్ టెన్షన్ వాడి ఆ హెయిర్ స్టయిల్ మేనేజ్ చేశాడు. ఆ సంగతి స్వయంగా అతనే చెప్పాడు. ఈ వ్యవహారానికి నలభై గంటలు పడుతుందని, ఈ చిత్రం కోసం మొత్తం మూడు సార్లు అలా చేయించుకోవాల్సి వచ్చిందని బన్నీ చెప్పుకొచ్చాడు.

    పెళ్లి కోసమని ఓసారి ఆ హెయిర్ ఎక్స్ టెన్షన్ ని తీసేయాల్సి వచ్చిందట. అయితే మగధీర సినిమా తర్వాత వాత పెట్టుకుంటున్న హీరోలెవరకీ చరణ్ కి ఉన్న ఓపిక లేకపోవడం విచిత్రంగా ఉంది. శక్తిలో ఎన్టీఆర్ విగ్గుతో మేనేజ్ చేస్తే, బన్నీ ఇలా ఇంకో పద్దతిలో విగ్గులాంటిదే వాడాడు. కానీ మగధీర కోసం చరణ్ నిజంగా రెండేళ్ల పాటు జుట్టు తీయనేలేదు. కంటిన్యుటీ సమస్య రాకూడదని షూటింగ్ జరిగినంత కాలం చరణ్ అదే హెయిర్ తో ఉండిపోయాడు. అందుకే అతని హెయిర్ మగధీరలో అంత నేచురల్ గా ఉంది. కానీ అల్లు అర్జున్, ఎన్టీఆర్ లకి 'మగధీర" లాంటి హిట్ కావాలని ఉంది కానీ అలా తమని తాము 'రియల్" తీర్చుదిద్దుకునే ఓపిక మాత్రం లేదని తేలింది.

    English summary
    Several thought that Allu Arjun's hair (hairstyle) in Badrinath is his real hair but Allu Arjun has undergone 'hair extensions', which take around 40 hours per sitting to attach artificial stands to the existing hair.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X