»   » రామ్ చరణ్ పుట్టిన రోజున ఫ్యాన్స్ కు కానుక

రామ్ చరణ్ పుట్టిన రోజున ఫ్యాన్స్ కు కానుక

Posted By:
Subscribe to Filmibeat Telugu
 Cherry&KV's first look on
హైదరాబాద్: హీరో పుట్టిన రోజు కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తూంటారు. ఆ రోజున వారు సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. అందుకే ఆ రోజున వారిని ఆనందపరచటానికి హీరోలు తమ తాజా చిత్రానికి సంభందించిన ఫస్ట్ లుక్ గానీ, ఆడియోని కానీ విడుదల జరిగేటట్లు ప్లాన్ చేసుకుంటున్నారు. రామ్ చరణ్ సైతం అదే బాటలో ప్రయాణం చేస్తున్నారు. ఆయన పుట్టిన రోజు మార్చి 27. ఆ రోజున తన కొత్త చిత్రం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ లో రామ్ చరణ్ మాత్రమే ఉంటాడని తెలుస్తోంది.

రామ్‌చరణ్‌ హీరోగా కృష్ణ వంశీ దర్శకత్వంలో ఓ కుటుంబ కథా చిత్రం తెరకెక్కుతోంది. కాజల్‌ హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని బండ్ల గణేష్‌ నిర్మిస్తున్నారు. శ్రీకాంత్‌, కమలిని ముఖర్జీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని రామ్ చరణ్ పుట్టిన రోజున అంటే మార్చి 27న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి విజేత అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం.

ఈ నెల ఇరవై ఆరవ తేదీ వరకూ అక్కడ షూటింగ్ జరుగుతోంది. కుటుంబ నేపథ్యంలో వచ్చే కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. చరణ్‌తోపాటు ప్రధాన తారాగణమంతా చిత్రీకరణలో పాల్గొంటోంది. దూరం మనషులకే కానీ, మనసులకు కాదు అని తెలియచేస్తూ హీరో తెగిన బంధాలను ఒక్కటి గా చేసే విజేతగా కనిపిస్తాడని చెప్తున్నారు. ఈ నెలాఖరుకు ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నారు.

ఈ చిత్రంలో చరణ్‌ విదేశాల్లో చదువుకొనే ఓ యువకుడిగా నటిస్తాడని తెలుస్తోంది. మే నుంచి విదేశాల్లో చిత్రీకరణ జరుపుతారని సమాచారం. ''కుటుంబ అనుబంధాలతో పాటు, చరణ్‌ శైలికి తగ్గ మాస్‌ అంశాలు కూడా చిత్రంలో ఉంటాయి''అని నిర్మాత చెబుతున్నారు. నలభై రోజులపాటు ఈ షెడ్యూల్‌ సాగుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ- ''కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు, తెలుగు సంప్రదాయాలు కలగలిపి తీర్చిదిద్దుకున్న కథ ఇది. సినిమాలో రామ్‌చరణ్‌ కొత్తగా కనిపిస్తాడు. శ్రీకాంత్‌ ఇందులో రామ్‌చరణ్‌కి యంగ్‌ బాబాయిగా కనిపిస్తారు. వీరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తాయి. తమిళ నటుడు రాజ్‌కిరణ్‌ పాత్ర చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నాగర్‌కోయిల్‌, పొల్లాచ్చిలోనూ చిత్రీకరణ జరుపుతాము''అన్నారు.


కృష్ణవంశీ మాట్లాడుతూ... తాను ప్రస్తుతం రామ్ చరణ్ తో 'మురారి' వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసే పనిలో ఉన్నానని కృష్ణ వంశీ చెప్పుకొచ్చారు తండ్రిగా నాగార్జునని అడుగుతున్నారని తెలుస్తోంది. తాతగా రాజ్ కిరణ్ కనిపించనున్నాడు. ఇంకా ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు నటినటులు నటిస్తున్నారు. ఆ వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అన్నారు బండ్ల గణేష్. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.

English summary
Ram Charan will be unveiling the first look of his movie being shaped by Krishnavamsi on the eve of his birthday on March 27th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu