చిన్ని కృష్ణ పెద్ద ఆశలు...చిరంజీవినే టార్గెట్ చేసాడు!

By Bojja Kumar

హైదరాబాద్: తెలుగు సినీ రచయిత చిన్ని కృష్ణ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. ఇంద్ర లాంటి సూపర్ హిట్ సినిమాకు కథను అందించి మెగా రైటర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన త్వరలో దర్శకుడి అవతారం ఎత్తబోతున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. అంతా బానే ఉంది కానీ.....చిన్ని కృష్ణ పెద్ద ఆశలు ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం అయ్యాయి.

ప్రస్తుతం తన చేతిలో 10 కథలు ఉన్నాయని...అందులో ఐదింటికి తానే దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నానని, మిగిలినవి ఇతరులకు ఇస్తానని చిన్న కృష్ణ వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు కూడా కథను రెడీ చేస్తున్నానని, అవకాశం ఇస్తే ఆ సినిమాకు దర్శకత్వం కూడా వహిస్తానని, మహేష్ బాబు, రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ లాంటి వాళ్లతో పని చేయాలని(దర్శకుడిగా..) కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

Chinni Krishna

కాగా...చిన్న కృష్ణ వ్యవహారంపై ఫిల్మ్ నగర్లో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆశ పడటంలో తప్పు లేదుకానీ......తొలి అడుగే ఆకాశంలో వేస్తానంటే ఎలా? అని పలువు ప్రశ్నిస్తున్నారు. చిరంజీవితో సినిమా అంటే మాటలు కాదు, ఎంతో అనుభవం ఉంటే తప్ప ఆయన సినిమాకు దర్శకత్వం వహించే స్థాయి రాదు అంటున్నారు.

తాను దర్శకుడిగా తెరంగ్రేటం చేస్తున్న విషయానికి హైప్ తేవడానికే......చిన్ని కృష్ణ చిరంజీవి, మహేష్ బాబు లాంటి వారి ప్రస్తావన తెచ్చారని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ గుసగుసలపై చిన్ని కృష్ణ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అయినా ఫిల్మ్ నగర్లో ఇలాంటి గుసగుసలు సర్వసాధారణమే! ఏది ఏమైనా...దర్శకుడిగా చిన్న కృష్ణ అందనీ మెుప్పించే సినిమాలు తీయాలని ఆశిద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X